Posts

Showing posts from November, 2025

డిసెంబర్ నుంచి అందరికీ కొత్త ఆధార్ కార్డులు

Image
వార్త నేత్రం ప్రతినిధి  హైదరాబాద్ నవంబర్ 29.   UIDAI కొత్త ఆధార్ కార్డు రీడిజైన్ – డిసెంబర్‌లో భారీ మార్పులు! ఇది ఎందుకు? ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు… భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది.. డిసెంబర్ నుండి కొత్త ఆధార్ కార్డు దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ కొత్త ఆధార్ కార్డు ప్రైవసీ & సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా రూపొందించబడుతోంది.  పాత ఆధార్ vs కొత్త ఆధార్ — ప్రధాన తేడాలు కొత్త ఆధార్ కార్డు ఎలా ఉంటుంది? కార్డు పై కేవలం: ✔️ ఫోటో ✔️ QR కోడ్ మాత్రమే కనిపిస్తాయి. పాత ఆధార్‌లో ఉండే ఈ వివరాలు ఇక కనిపించవు ❌ పేరు ❌ ఆధార్ నంబర్ ❌ చిరునామా ❌ పుట్టిన తేదీ ❌ లింగం అంటే కార్డుపై ఎటువంటి వ్యక్తిగత సమాచారం ముద్రిత రూపంలో ఉండదు. QR కోడ్‌లో ఏముంది? కొత్త ఆధార్‌లోని QR కోడ్‌లో… ➡️ పేరు ➡️ ఆధార్ నంబర్ ➡️ DOB ➡️ చిరునామా ➡️ లింగం ➡️ బియోమెట్రిక్ వెరిఫికేషన్ డేటా (ఎన్‌క్రిప్టెడ్ రూపంలో) అన్నీ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. ఈ QR కోడ్‌ను డీకోడ్ చేయగలిగేది ✔️ ప్రభుత్వ అథోరైజ్డ్ స్కానర్లు ✔️ UIDAI అధికారిక యాప్‌లు ✔️ వె...

E-paper

Image
www.varthanethramE-paper.com

E-paper Varthanethram

Image
www.varthanethram E-Paper.com

Vartha nethram E - paper.com

Image
www.varthanethram- E paper.com

Vartha Nethram E-paper

Image
Vartha nethram E- paper

టీ 20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 25 వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఐసీసీ మంగళవారం ప్రకటించింది, ఈ టూర్నికి భారత్,శ్రీలంక,సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది... గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ స్టేడియంలో ఫైనల్‌మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరితే కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్‌లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో మ్యాచులు జరుగనున్నాయి. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.  ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌ నుంచి రెండేసి జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని అయిదు వేదికల్లో అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి శ్రీలంకలోని మూడు వేదికల్లో క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో జరగనున్నాయి.  ఈ మెగా టోర్నమెంట్‌...

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:నవంబర్ 25 ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.  దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29 కి పెరగనుంది, కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు.  అనంతరం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మదనపల్లె, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కీలక నిర్ణయాలు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అధ్య­క్ష­తన జి­ల్లాల పు­న­ర్వి­భ­జన, డి­వి­జ­న్లు, మం­డ­లాల మా­ర్పు చే­ర్పు­ల­పై సచి­వా­ల­యం­లో కీలక సమీ­క్ష జరి­గిం­ది.  ఈ సం­ద­ర్భం­గా నూ­త­నం­ గా మూడు జి­ల్లాల ఏర్పా­టు­కు ప్ర­భు­త్వం గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. ము...

పట్టించింది భార్య కాదు.. ఐ బొమ్మ రవి ఎలా దొరికాడో బయటపెట్టిన పోలీసులు

Image
వార్త నేత్రం:  న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్ నవంబర్ 25. ఐబొమ్మ రవి దొరకడానికి కారణం అతని భార్య కాదని పోలీసులు స్పష్టం చేశారు.స్నేహితుడు నిఖిల్‌ ద్వారా ఐబొమ్మ రవిని పోలీసులు ట్రాప్ చేశారు. ఐ బొమ్మ, బప్పమ్‌ మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్‌ తయారు చేస్తున్నాడని అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనల ద్వారా డబ్బులు వచ్చేవని, ఆ డబ్బును యాడ్‌ బుల్ అనే కంపెనీకి రవి మళ్లించాడని చెప్పారు. యాడ్‌ బుల్‌ కంపెనీ రవికి చెందినదేనని, ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వస్తుందని అడిషనల్ సీపీ శ్రీనివాసులు బయటపెట్టారు. రవిని అతని భార్య పట్టించిందనే వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. ఐబొమ్మ రవి పైరసీ కేసుపై అడిషనల్ సీపీ శ్రీనివాసులు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఐబొమ్మ డొమైన్ను Njila అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడని, మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నాడని ఆయన చెప్పారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మ, బప్పం ద్వారా సినిమాలు పోస్ట్ చేస్తున్నాడని తెలిపారు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్వేర్లో రీ డైరెక్ట్ స్...

శాలిబండ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం!

Image
 వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 25 హైదరాబాద్ పాతబస్తీ శాలి బండ బ్లాక్ టవర్ పక్కన ఉన్న గోమతి ఎలక్ట్రానిక్ షాపులో బారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలిసింది,ఒక కారు ద్విచక్ర వాహనం మంటలకు పూర్తి గా తగలబడిపోయాయి..  గోమతి ఎలక్ట్రానిక్స్ షాపు పక్కన ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలు వాహనాలు దగ్ధమయ్యా యని లక్ష్మీ వస్త్రా యజ మాని ఆవేదన చెందారు. ఆరుగురికి గాయాలు కాగా..క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నా లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నా రు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.

బెంగళూరులో అన్నమయ్య జిల్లా యువతి దారుణ హత్య..

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 25 కర్ణాటక రాజధాని బెంగ ళూరులో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, బిక్కంగారిపల్లికి చెందిన దేవశ్రీ (21) అనే విద్యార్థిని హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది....  ఉన్నత చదువులతో ఉజ్వల భవిష్యత్తును ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.వివరాల్లోకి వెళితే.. రెడ్డప్ప,జ‌గ‌దాంబ దంప‌తుల కుమార్తె అయిన దేవశ్రీ బెంగళూరులోని ఆచార్య కళాశాలలో బీబీఏ నాలుగో సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం అక్కడే ఓ అద్దె గదిలో నివసిస్తోంది.  ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండ మర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్, అనే యువకుడి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని నిందితుడు దేవశ్రీ అనే విద్యార్థినిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దేవశ్రీ తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తిం చారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు.  మదనాయ‌నకహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు...

నేడు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 25 తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తై.. ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాయి.  ఇవాళ మధ్యాహ్నాం 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్‌కు అందినట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి డీపీవోలు మూడు సెట్ల గెజిట్ కాపీలను పంచాయతీరాజ్ కమిషన రేట్‌లోని హెల్ప్‌డెస్క్‌లో అందజేశారు.పంచాయతీరాజ్ అధికారులు ఈ గెజిట్ కాపీలను పరిశీలించి, వాటిని మూడు ప్రధాన విభాగాలకు అందజేశారు.  ఒక సెట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరొక సెట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CS రామకృష్ణా రావుకు, మిగిలిన కాపీలను రికార్డుల కోసం ఉంచారు. రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌ లోని ఏసీ గార్డ్స్‌లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోఈరోజు స...

జీహెచ్ఎంసి విస్తీర్ణకు సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ ఆమోదం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 25 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన మంగళవారం ఉదయం సచివాలయంలో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో జీహెచ్ఎంసీ విస్తరణ, విద్యుత్ రంగ సంస్కరణలు, క్రీడా, విద్య రంగ అభివృద్ధి వంటి పలు అంశాలపై కేబినెట్ విపులంగా చర్చింది.. నిర్ణయాలు తీసుకుంది. *1. మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం!* హైదరాబాద్ పట్టణీకరణ వేగం పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని పరిసర ప్రాంతాలను ఒకే పట్టణ పరిపాలన కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంట ఉన్న 27 మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీతో విలీనం కానున్నాయి.  పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయం జాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్ జీహెచ్ఎంసీలో వీలినం అ...

రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందజేస్తాం: మంత్రి పొన్నం

Image
వార్త నేత్రం ప్రతినిధి :  హైదరాబాద్ నవంబర్ 24  తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ...ముఖ్యంగా ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఈ చీరలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సిద్దిపేట జిల్లాలోని కోహెడలో జరిగిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి.. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరలను పంపిణీ చేస్తామని.. మహిళా సంఘంలోని మహిలళే ఇంటికి వచ్చి బొట్టు పెట్టి అందజేస్తారన్నారు. ఆడబిడ్డలకు ఏ కష్టం రానివ్వమని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలను వేగ...

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

Image
వార్త నేత్రం న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్, నవంబర్ 24 : డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల MDMA, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ ఈవెంట్‌ను టార్గెట్‌గా పెట్టుకొని డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తోంది ముఠా. మొత్తం ముగ్గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 42 ...

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన..

Image
వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్, నవంబర్ 24: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని లేఖలో పేర్కొంది. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు మావోయిస్టు పార్టీ లేఖలో వెల్లడించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతాదళాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ఈ మేరకు లేఖను విడుదల చేసింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా ఆయుధాల...

రౌడీషీటర్లు అలా చేస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్

Image
వార్త నేత్రం న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్. నవంబర్ 24  నగరంలో రాత్రివేళల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారనే విషయాన్ని తాను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నానని పేర్కొన్నారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు పోలీసు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయని చెప్పుకొచ్చారు సీపీ సజ్జనార్. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్‌లో సీపీ సజ్జనార్ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12:00 గంటల నుంచి 3:00 గంటల వరకు లంగర్‌హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆ వాహనంలోనే లంగ‌ర్ హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి… వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామా...

Vartha nethram telugu news paper pdf

Image
click link below  Varthanethram- E paper  pdf

Vartha nethram daily

varthanethra m pdf

తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 22 మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగి లింది. ఈరోజు మధ్యాహ్నం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరంతా తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, ఎదుట లొంగి పోయారు. మావోయిస్టుల వద్ద 303 రైఫిల్స్ G3 రైఫిల్స్ ఎస్ ఎల్ ఆర్, ఏ కె 47 రైఫిల్స్, బుల్లెట్స్, క్యాట్రెజ్,తదితర ఆయుధా లను పోలీసులకు అందజేశారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, బీకే-ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పొలీసులకు లొంగిపోయారు. ఆయనతో సహా మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎదుట లొంగిపోయారు.  ఈ మేరకు వీరి లొంగు బాటులో ఇవాళ హైదరాబాద్‍లో డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికం గా ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు.  లొంగిపోయిన మావోయిస్టు లకు రివార్డు నగదుతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా ఏవోబీ ప్రాంతంలో మావో యిస్టు పార్టీ నిర్మాణంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారు.

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... పోలీస్ శాఖలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. పాత ప్రభుత్వా నికి అనుకూలంగా ఉన్నా రని భావించిన లేదా?ఎన్ని కల కమిషన్ నిబంధనల ప్రకారం ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసిన అధికారు లను ఈ బదిలీల్లో భాగంగా కీలక స్థానాల నుంచి మార్చడం జరిగింది.  ఈ బదిలీల ద్వారా పలువురు యువ, డైనమిక్ అధికారులకు జిల్లాల్లోనూ, నగరంలోని కీలక విభాగా ల్లోనూ బాధ్యతలు అప్పగిం చారు.ఈ బదిలీలలో భాగంగా.. పోలీస్ శాఖలో ప్రధాన విభాగాలకు కొత్త సారథులను నియమించా రు. చౌహాన్ కి అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ పర్సనల్) వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించడం జరిగింది. రాష్ట్రంలోని హై-ప్రొఫైల్ కేసుల దర్యాప్తు బాధ్యతలు చూసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ సీఐడీ, డీఐజీగా పరిమిళా నూతన్ని నియమించారు. శాంతిభద్రతల నిర్వహణలో అత్యంత ముఖ్యమైన స్థానాల్లో మార్పులు ఇలా ఉన్నాయి. మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించే తెలంగాణ నార్కొటిక్ ఎస్ప...

ఫార్ములా ఈ కార్ రేసులో నన్ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేడు: మాజీ మంత్రి కేటీఆర్!

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 ఫార్ములా-ఈ కార్‌ కేసులో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి,కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేటీఆర్ స్పం దించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చేసుకోనివ్వండి. నేను తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా నేను రెడీ అయ్యా. ఇంతకు మించి చెప్పేదేం లేదు. అయినా, సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు.. నా అరెస్టు జరగదు. ఆ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవ హారంపై మాట్లాడుతూ.. దానం నాగేంద్రతో రాజీనామా చేయించి.. కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.  దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు. అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని రాజీనామా చేపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తు న్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రే...

ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన ఈనెల 25న సెక్రటేరియట్‌ లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమా వేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధ తపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు.  అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థ వంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

ఈనెల 25న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 రాష్ట్రంలో గ్రామపంచాయ తీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిం చింది. పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేష న్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది.  ఎన్నికల్లో 50 శాతం మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50 శాతం జనరల్ కేటగిరీ స్థానాలుంటాయి. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే ఎస్ఈఈఈ పీసీ,2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వే షన్లు ఖరారు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించాలి.  రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే 25వ తేదీన షెడ్యూల్ ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర...

తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్‌ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి ప్రయత్నాలను ఒక్కోసారి పంచ్‌లతో అదరగొడుతూ, నైపుణ్యాన్ని సమపాళ్లలో ప్రదర్శించింది. ముగింపు వరకు అదే ఆత్మవిశ్వాసం కొనసాగించడంతో విజయం నిఖత్‌ ఖాతాలో పడింది. ఇటీవల ప్రపంచ ఛాంపి యన్‌షిప్‌లో క్వార్టర్స్‌లో పరాజయం పొందిన నిఖత్‌కు ఈ విజయం ఎంతో కీలకం. ఆ ఓటమిని పక్కనబెట్టి, కొత్త జోష్‌తో తిరిగి గాడిలో పడినట్లు ఈ స్వర్ణం చెబుతోంది. నిఖత్‌తో పాటు మరికొంత మంది భారత బాక్సర్లు కూడా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో చైనీస్ తైపీ స్టార్, పారిస్ కాంస్య పతక విజేత వుయీను తేలిగ్గా ఓడించింది....

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు!

Image
వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియోలకు జిహెచ్ఎంసి అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు అందించారు. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించింది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బయటపడింది.దీంతో పూర్తి స్తాయిలో ట్రేడ్ లైసెన్స్‌ ఫీజు చెల్లించాలి అంటూ రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాలి.  అయితే.. కేవలం 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లుగా తేలింది. అలాగే రామానాయుడు స్టూడియో 1,92 లక్షలు చెల్లించవలసి ఉండగా కేవలం1900 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా గుర్తించారు. అందుకనే అన్నపూర్ణ, రామానాయు డు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ముగిసిన కార్తీక మాసం!నేడు పోలి స్వర్గం విశేషమైన దినం

Image
 వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 21 హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసం నవంబర్ 20 గురువారం రోజున కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగిసింది..  30 రోజులపాటు భక్తిశ్రద్ధల తో సాగిన కార్తీకమాసం గురువారంతో ముగిసింది రోజు వారిగా శివునికి ప్రత్యేక పూజలు అభిషేకా లు అర్చనలు నంది అభిషే కాలు దీపోత్సవం రాత్రివేళ ఆకాశ జ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అను గ్రహాన్ని అందుకున్నారు. దేశంలోని పంచరామాల యంతో సహా వివిధ పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్లి నది స్థానాలు ప్రత్యేక అర్చనలు చేపట్టిన భక్తులు కఠిన నియమాలతో 30 రోజుల పాటు పూజలు నిర్వహించారు. కార్తీకమాసం ముగిసిన మరుసటి రోజు ఈరోజు శుక్రవారం పోలిస్వర్గం పర్వదినాన్ని భక్తులు ప్రత్యే కంగా జరుపుకుంటారు  తెల్లవారుజామునే నదీ ప్రవాహంలో దీపాలను వదలడం ఆనవాయితీ వీలుకాని భక్తులు ఆలయాల్లో వెలిగిస్తారు నెలరోజులపాటు నియ మాలు పాటించకపోయినా పోలీ పౌండ్యమి రోజున కనీసం 30 వత్తులు వెలిగిస్తే విశేష పుణ్యము లభిస్తుం దని భక్తుల విశ్వాసం కార్తీక పర్వదినంలో ప్రారంభమైన భక్తి దీపార్చన పోలి స్వర్గం రోజున మరింత భక్త...

మీకు తెలుసా .. వివాహిత స్త్రీల ఆస్తి చట్టం, 1874

Image
వార్త నేత్రం : న్యూస్  ప్రతినిధి   MWP Act అంటే Married Women’s Property Act, 1874 (వివాహిత స్త్రీల ఆస్తి చట్టం, 1874). ఈ చట్టం భారతదేశంలో వివాహిత స్త్రీల ఆర్థిక హక్కులను రక్షించడానికి రూపొందించబడింది. ఇది జీవిత బీమా పాలసీలకు కూడా వర్తిస్తుంది — ముఖ్యంగా, భర్త తన భార్య మరియు పిల్లల భద్రత కోసం తీసుకునే పాలసీలకు. ఇప్పుడు దీన్ని  వివరంగా చూద్దాం 👇 🧾 MWP Act అంటే ఏమిటి? ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి (సాధారణంగా భర్త) తన పేరుతో జీవిత బీమా పాలసీ తీసుకుంటే, దానిని MWP Act సెక్షన్ 6 కింద రిజిస్టర్ చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత, ఆ పాలసీకి సంబంధించిన మొత్తం కేవలం భార్య మరియు పిల్లలకే లభిస్తుంది. 💡 ఇది ఎందుకు అవసరం? ఒక వ్యక్తి మరణించిన తర్వాత, అతని బీమా డబ్బు సాధారణంగా అతని వారసులకు లేదా అతని బాకీలను తీర్చడానికి వెళ్తుంది. కానీ చాలా సందర్భాల్లో — వ్యాపార నష్టాలు అప్పులు కుటుంబ వివాదాలు వంటి కారణాలతో భార్య, పిల్లలు ఆ డబ్బును పొందలేకపోవచ్చు. MWP Act కింద పాలసీ తీసుకుంటే, 👉 ఆ పాలసీని ఎవరూ క్లెయిమ్ చేయలేరు — బ్యాంకులు, అప్పుదారులు, లేదా ఇతర బంధువులు కూడా కాదు. 👉 ఆ డబ్బు నేరుగా భార్య...

పోలీసు కస్టడీకి ఐ బొమ్మ ఇమ్మడి రవి!

Image
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 19  సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐ బొమ్మ ఇమ్మడి రవి,కి నాంపల్లి హైకోర్టు ఐదు రోజులు పోలీస్ కస్టడీ విధించింది, ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కేసులో కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరా లు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి, ఐదు రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. దీంతో పోలీసులు ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణ లతో ఇమ్మడి రవిని గత శనివారం కూకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్లుగా ఐ బొమ్మతో పాటు బప్పం,ఐ విన్, ఐ రాధ టీవీ వంటి పేర్లతో పలు వెబ్‌...

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు!

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 19 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారిం చడం కోసం బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను తెలంగాణ జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ కార్యకర్తలు కలిసి ముట్టడించారు.  ఈ సందర్భంగా కార్యకర్తల తో కలిసి ఆటోలో కవిత చేరుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరిం చాలని.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో సింగరేణి భవన్‌ను ముట్టడించేం దుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తోపులాట అనంతరం కవిత సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.  కొత్త బ్లాకులను కేవలం సింగరేణికి మాత్రమే కేటా యించాలని పేర్కొన్నారు. ఇది సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్య మని తెలిపారు.సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శ...

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 19 తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అంతకు ముందు నెక్లెస్ రోడ్డులో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు.  ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డి సర్కార్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాలన బలహీన వర్గాలకు సువర్ణ అధ్యాయమని, ఆమె పరిపాలన ఒక మోడల్ అని కొనియాడారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో 'ప్రజాపాలన' అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతోనే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ జయంతి రోజు అయిన నేడు ప్రారంభించి డిసెంబర్ 9 వర...

సత్య సాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ!

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 19 ప్రధాని నరేంద్ర మోడీ, బుధవారం పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంత్వత్సవానికి ఆయన హాజరయ్యారు. మానవ సేవయే.. మాధవ సేవ అన్న సత్యసాయి బాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సత్యసాయి జయంత్యుత్స వాల్లో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా నిలిచా రన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యా త్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. పుట్టపర్తి పురవీధులు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి.  ఈ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సత్యసాయి బోధనలు ప్రపంచానికి సన్మార్గం చూపాయని ప్రధాని మోదీ అన్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు ఇదే ఆయన నినాదం.. వేలాది జీవితాలను మార్చేసింద న్నారు.  ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన స్పూర్తి.. లక్షల మందిని సేవా మార్గంలో మళ్లించ...

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 19 మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో సోమ, మంగళ వారాల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయిం ది, పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది..,  దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శబరిమలలో రెండు నెలల పాటు జరిగే మండల- మకర విళక్కు యాత్రా సీజన్ గందరగోళంతో ప్రారంభమైంది. విపరీత మైన రద్దీ, కనీస సౌకర్యాల లేమి, అధికారుల వైఫల్యం తో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.  మంగళవారం, బుధవారం నాడు రద్దీని నియంత్రించేం దుకు దర్శన సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిం చాలని నిర్ణయించినప్పటికీ, సోమవారం నుంచి రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు సరిపోలేదు.  స్వామివారి దర్శనం కోసం భక్తులు 10 నుంచి 15 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. పవిత్రమ...

ఏపీలో మరో భారీ ఎన్ కౌంటర్!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:నవంబర్ 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది, బుధవారం తెల్లవారు జామున భద్రతా బలగాలు, మావోయిస్టుల కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా వెల్లడించారు.  మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిద న్నారు. ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఆజాద్,దేవ్ జీ, మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏడీజీ పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్ని స్తున్నారు. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నాం. నవంబరు 17న ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావో యిస్టులు హతమయ్యారు.  మరోవైపు ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్ల...

నేడు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల!

Image
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి అమరావతి:నవంబర్ 19 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు నేడు 19వ తేదీ బుధవారం 21విడత నిధులు విడుదలl కానున్నాయి, మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నేరుగా రూ"2,000 చొప్పు న జమ కానున్నాయి... వీటితోపాటు..అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు రూ.5వేలు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేరోజు రూ.7వేల నగదు జమ కానుంది.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి.  ఇందులో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92కోట్లు కాగా.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటా రూ. 972.09 కోట్లు ఉంటుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీయేటా మూడు విడతల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది.  పిఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20వేలు జమ చేస్తామని చెప్పింది....

కోచింగ్ కేంద్రాల కాసుల వేట..!

Image
  ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు.     నిబంధనలు లేవు… నియంత్రణ లేదు.        ఆదిలాబాద్ , వార్త నేత్రం ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ తీవ్రంగా పెరుగుతున్న ఈ కాలంలో కోచింగ్ సెంటర్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్క పోస్టుకు వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భంలో యువత , విద్యార్థులు కోచింగ్ కోసం సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కూడా ఎంతటి ఖర్చైనా వెనకాడడం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొన్ని కోచింగ్ సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను , వారి తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. ఐఐటీ , నిట్ , నీట్ , సివిల్స్ , గ్రూప్స్ , పోలీస్ , బ్యాంకింగ్ వంటి కోర్సుల పేరుతో కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తున్నామంటూ 50 నుండి 60 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సెంటర్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. హాస్టల్లో వుంటునా   విద్యార్దులకు   కనీస మౌలిక వసతుల...