జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు!

వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:నవంబర్ 19

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారిం చడం కోసం బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను తెలంగాణ జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ కార్యకర్తలు కలిసి ముట్టడించారు. 

ఈ సందర్భంగా కార్యకర్తల తో కలిసి ఆటోలో కవిత చేరుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరిం చాలని.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో సింగరేణి భవన్‌ను ముట్టడించేం దుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే తోపులాట అనంతరం కవిత సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 

కొత్త బ్లాకులను కేవలం సింగరేణికి మాత్రమే కేటా యించాలని పేర్కొన్నారు. ఇది సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్య మని తెలిపారు.సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని ఆరోపించిన కల్వకుంట్ల కవిత.. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులకు వెళ్తోం దని చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఈ అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను నిలిపివేయా లని.. తద్వారా కార్మికులపై ఆర్థిక భారం తగ్గుతుందని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్