కోచింగ్ కేంద్రాల కాసుల వేట..!

 




  • ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.
  • పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు. 
  •  నిబంధనలు లేవు… నియంత్రణ లేదు.

       ఆదిలాబాద్, వార్త నేత్రం ప్రతినిధి:


ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ తీవ్రంగా పెరుగుతున్న ఈ కాలంలో కోచింగ్ సెంటర్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్క పోస్టుకు వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భంలో యువత, విద్యార్థులు కోచింగ్ కోసం సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కూడా ఎంతటి ఖర్చైనా వెనకాడడం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొన్ని కోచింగ్ సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను, వారి తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. ఐఐటీ, నిట్, నీట్, సివిల్స్, గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్ వంటి కోర్సుల పేరుతో కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తున్నామంటూ 50 నుండి 60 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సెంటర్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. హాస్టల్లో వుంటునా  విద్యార్దులకు  కనీస మౌలిక వసతులు కలిపించటం లేదాని ఓకే గదిలో ఇరుకిరుకుగా పది పదిహేను మాందిని కుక్కుతున్నారనే  ఆరోపణలున్నాయి .  ప్రైవేట్ హోస్టల్ ఏర్పాటు చేయడానికి కొన్ని నియమా నిబంధనలు వున్నాయి.అవి  స్థానిక మున్సిపాలిటీ/పంచాయతీ నుండి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్ ల నుండి ఎన్ ఓ సి  తీసుకోవలీ. స్థానిక  భవనం సేఫ్టీ సర్టిఫికేట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ వుండాలి. మెస్ నిర్వహిస్తే ( FSSAI ) భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ నుండి మెస్/కిచెన్ రిజిస్ట్రేషన్ అవసరం. ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్కరూ ఈ నియమ నిబందనలు పాటించడం లేదు.

ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల క్యూ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖాళీలను భర్తీ చేస్తామనే ప్రకటనలు రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వయో పరిమితి పెంచడంతో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారు కూడా మళ్లీ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. గృహిణులు, చిన్న ఉద్యోగాలు చూసుకునే మహిళలు కూడా పుస్తకాలు చేతబట్టడం మొదలుపెట్టారు. దీంతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇదే పరిస్థితిని ప్రయోజనంగా మార్చుకుని నిర్వాహకులు ఒక్కసారిగా ఫీజులను పెంచేశారు. ఉద్యోగం కావాలన్న పట్టుదలతో నిరుద్యోగులు అప్పులు చేసి అయినా ఈ ఫీజులు చెల్లిస్తున్నారు.

నిబంధనలు లేవు… నియంత్రణ లేదు!

తెలంగాణలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2024లో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసినా, అవి రాష్ట్రంలో అమలు కావడం లేదు.

కేంద్ర మార్గదర్శకాల్లో కీలక నిబంధనలు

  • వయోపరిమితి: 16 ఏళ్ల లోపు విద్యార్థులను చేర్పించరాదు.
  • ఫీజులు: న్యాయంగా, సహేతుకంగా ఉండాలి. కోర్సు వదిలేస్తే 10 రోజుల్లోపే మిగిలిన ఫీజులు రిఫండ్ చేయాలి.
  • మౌలిక సదుపాయాలు: అగ్నిమాపక భద్రత, సరైన వెలుతురు, తాగునీరు, స్త్రీ పరుషులకు వేరు వేరు  మరుగుదొడ్లు, ఫస్ట్ ఎయిడ్ తప్పనిసరి.
  • ట్యూటర్ అర్హతలు: కనీసం గ్రాడ్యుయేషన్ ఉండాలి. నేరపూరిత చరిత్ర ఉన్నవారిని నియమించరాదు.
  • మానసిక శ్రేయస్సు: ఒత్తిడి తగ్గించే వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. కౌన్సెలింగ్ వసతులు ఉండాలి.
  • పాఠ్యాంశాలు: రోజుకు 5 గంటలకు మించి క్లాసులు ఉండకూడదు. వారంలో ఒకరోజు సెలవు తప్పనిసరి.
  • ప్రకటనలు: ఫేక్ రిజల్ట్స్, ర్యాంకుల హామీలు, విద్యార్థుల ఫోటోలు అనుమతి లేకుండా వాడడం నిషేధం.

ఈ మార్గదర్శకాలు తెలంగాణ లో అమలు అవ్వడం లేదు ప్రభుత్వ నియంత్రణ లేక పోవటం వల్ల ఇస్ట రీతిన ఫీజులు వసూలు చేస్తూ అందిన కడికి దండుకుంటునాయి.

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు,అర్హతలేని టీచర్లు…

ఆదిలాబాద్ జిల్లాలో పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్  లు పుట్టుకొస్తున్నాయి. నిబందనలు ఏవి లేకపోవటం వల్ల ఇదొక లాభదాయక వ్యాపారం గా మారింది. ఇందులో కొందరు ప్రభుత్వ  ఉద్యోగులు నిబందనలకు విరుదంగా కోచింగ్ సెంటర్ లను నడుపుతున్నారు. అనేక కోచింగ్ సెంటర్లు తమ దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయుల అర్హతలపై స్పష్టత ఇవ్వడం లేదు. అనుభవం లేకున్నా బోధన చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది.

ప్రభుత్వం చేయాల్సినవి

  • కోచింగ్ సెంటర్లకు స్పష్టమైన గుర్తింపు విధానం తేవాలి.
  • ఫీజులపై గరిష్ఠ పరిమితి విధించాలి.
  • విద్యా నాణ్యత పరిశీలనకు ప్రత్యేక అధికారిని నియమించాలి.
  • విద్యార్థుల రక్షణ కోసం హెల్ప్ లైన్‌, ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
    
నిరుద్యోగుల కోసం కాదు… డబ్బు కోసం!”


కోచింగ్ సెంటర్లు నోటిఫికేషన్లను ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నాయి. చాలా సంస్థలు డబ్బు కోసమే పని చేస్తాయి తప్ప నిరుద్యోగుల ప్రయోజనాల కోసం కాదు. మంచి ర్యాంకులు సాధించిన వాళ్లలో చాలా మంది స్వీయ ప్రణాళికతో చదివినవారే. అభ్యర్థులు సిలబస్‌కు అనుగుణంగా ప్రిపేర్ అయితేనే విజయాన్ని అందుకుంటారు” అని సూచించారు.

విద్యను వ్యాపారంగా మార్చిన కోచింగ్ మాఫియా

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కోచింగ్ మాఫియాను అరికట్టాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన విధానాలతో ఈ రంగాన్ని నియంత్రించి విద్యార్థులపై భారాన్ని తగ్గించాలని విద్యార్దుల తల్లితండ్రులు, విద్యార్థి సంఘాలు  కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్