శాలిబండ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం!
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 25
హైదరాబాద్ పాతబస్తీ శాలి బండ బ్లాక్ టవర్ పక్కన ఉన్న గోమతి ఎలక్ట్రానిక్ షాపులో బారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలిసింది,ఒక కారు ద్విచక్ర వాహనం మంటలకు పూర్తి గా తగలబడిపోయాయి..
గోమతి ఎలక్ట్రానిక్స్ షాపు పక్కన ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలు వాహనాలు దగ్ధమయ్యా యని లక్ష్మీ వస్త్రా యజ మాని ఆవేదన చెందారు. ఆరుగురికి గాయాలు కాగా..క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నా లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నా రు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Post a Comment