సత్య సాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ!




వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:నవంబర్ 19

ప్రధాని నరేంద్ర మోడీ, బుధవారం పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంత్వత్సవానికి ఆయన హాజరయ్యారు. మానవ సేవయే.. మాధవ సేవ అన్న సత్యసాయి బాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

సత్యసాయి జయంత్యుత్స వాల్లో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా నిలిచా రన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యా త్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. పుట్టపర్తి పురవీధులు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. 

ఈ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సత్యసాయి బోధనలు ప్రపంచానికి సన్మార్గం చూపాయని ప్రధాని మోదీ అన్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు ఇదే ఆయన నినాదం.. వేలాది జీవితాలను మార్చేసింద న్నారు. 

ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన స్పూర్తి.. లక్షల మందిని సేవా మార్గంలో మళ్లించిందన్నారు. సమాజ సేవకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సత్యసాయి.. తాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 

పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందన్న ప్రధాని.. సత్యసాయి స్థాపించిన సంస్థలన్నీ ప్రేమను పంచుతూ వర్థిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారకార్థంగా రూపొందిం చిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, క్రికెటర్ సచిన్, సినీ నటి ఐశ్వర్య రాయ్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్