ముగిసిన కార్తీక మాసం!నేడు పోలి స్వర్గం విశేషమైన దినం
వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 21
హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసం నవంబర్ 20 గురువారం రోజున కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగిసింది..
30 రోజులపాటు భక్తిశ్రద్ధల తో సాగిన కార్తీకమాసం గురువారంతో ముగిసింది రోజు వారిగా శివునికి ప్రత్యేక పూజలు అభిషేకా లు అర్చనలు నంది అభిషే కాలు దీపోత్సవం రాత్రివేళ ఆకాశ జ్యోతి దర్శనంతో భక్తులు శివయ్య అను గ్రహాన్ని అందుకున్నారు.
దేశంలోని పంచరామాల యంతో సహా వివిధ పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్లి నది స్థానాలు ప్రత్యేక అర్చనలు చేపట్టిన భక్తులు కఠిన నియమాలతో 30 రోజుల పాటు పూజలు నిర్వహించారు. కార్తీకమాసం ముగిసిన మరుసటి రోజు ఈరోజు శుక్రవారం పోలిస్వర్గం పర్వదినాన్ని భక్తులు ప్రత్యే కంగా జరుపుకుంటారు
తెల్లవారుజామునే నదీ ప్రవాహంలో దీపాలను వదలడం ఆనవాయితీ వీలుకాని భక్తులు ఆలయాల్లో వెలిగిస్తారు నెలరోజులపాటు నియ మాలు పాటించకపోయినా పోలీ పౌండ్యమి రోజున కనీసం 30 వత్తులు వెలిగిస్తే విశేష పుణ్యము లభిస్తుం దని భక్తుల విశ్వాసం కార్తీక పర్వదినంలో ప్రారంభమైన భక్తి దీపార్చన పోలి స్వర్గం రోజున మరింత భక్తిశ్రద్ధల తో దీపారాధన చేస్తారు.
Comments
Post a Comment