Posts

Featured Post

త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: జనవరి 09  చెక్ పోస్టులు ఎత్తేసిన రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు సిద్ధమవుతుంది, కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, త్వరలో వాహనం కొనుగోలు చేసిన షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు.  దీంతో రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇకపై బైక్, కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో  కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాహనాలు కొనుగోలు చేసిన షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేయనుంది, రవాణ శాఖ. ప్రైవేట్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ కొత్త విధానం అమలు కానుంది. *ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్..* ఇప్పటివరకు ఉన్న విధానంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు కేవలం తాత్కాలిక రిజి స్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రే షన్ కోసం రవాణశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చ...

గవర్నర్ కు బాంబు బెదిరింపు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ రాజ్‌భవన్, వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది,గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బెదిరింపును అధికా...

విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 శనివారం నుండి సెల వులు ప్రారంభమవుతాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, మరియు 16న కనుమ పండుగలు ఉన్నాయి. సాధారణంగా కనుమ రోజున ఐచ్ఛిక సెలవు ఉన్నప్పటికీ.. విద్యా ర్థులు తమ స్వగ్రామాలకు వెళ్లే సౌకర్యార్థం 16వ తేదీ వరకు పూర్తి సెలవులు పొడిగించారు.  పండుగ సెలవుల అనంతరం జనవరి 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాను న్నాయి. కళాశాలలు మాత్రం ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి అయితే.. జనవరి 19 న తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారిం చాలని బోర్డు సూచించింది. సెలవుల్లో ప్రత్యేక తరగతు లు...

ప్రియుడు అనుమానించాడని యువతి ఆత్మహత్య?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా జనవరి 08   ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోవడా నికి తల్లిదండ్రులను ఒప్పించాడు ఫోన్లో ఎవరితో నో  మాట్లాడుతున్నావని వేధించడంతో యువతి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) తన అన్న అరవింద్‌తో కలిసి తట్టి అన్నారంలొని వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటోంది. అయితే వీరికి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) తో పరిచయం ఏర్పడింది. ఐశ్వర్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కాగా సూర్యాపేటకు చెందిన వీరి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్,( 23) నగరంలోని హస్తినా పురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఆనంద్ దూర బంధువు కావడంతో పలుమార్లు ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు వీరిద్దరి మధ్య పరిచయం కూడా ఏర్పడింది..   ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూశాడు. అప్పటి నుంచి తరచూ ఐశ్వర్య ఇంటికి వచ్చేవాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తు న్నాన...

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ 2026 -27 ఆర్థిక బడ్జెట్!9వ సారి దేశ ఆర్థిక బడ్జెట్: రికార్డ్ సృష్టించబోతున్న నిర్మలమ్మ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది, జన వరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి....  అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆది వారం వచ్చినా సాంప్రదా యాన్ని కొనసాగించేలా ఆదివారం కూడా సభను నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా 9 వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డుసృష్టించ బోతున్నారు.. ఈసారి బడ్జెట్ అంచనాలు గతంతో పోలిస్తే భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం సుమారు రూ"11 నుండి 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లు,జాతీయ రహదారులు, పోర్టుల, అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ప్...

నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 రానున్న మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన సవరణలపై నిరసనలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది..  ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ అను బంధ సంస్థల అధ్యక్షులతో ఈరోజు విస్తృతస్థాయి సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహించనుంది...  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,అధ్యక్షత వహించనున్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ. 4.23 కోట్లు మంజూరు చేశారు.  అయితే, కేవలం 19 రోజులు మాత్రమే స్నాక్స్ అందించనుండటం పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శ లు వెల్లు వెత్తుతున్నాయి రాష్ట్రంలో జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. రాష్ట్రం లో 4,303 హైస్కూళ్లు ఉండగా.. వీటి ల్లో పదో తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు.  రోజుకు ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్ ను వెంటనే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుండి స్కూళ్లక...