తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు!


వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:నవంబర్ 22

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగి లింది. ఈరోజు మధ్యాహ్నం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరంతా తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, ఎదుట లొంగి పోయారు. మావోయిస్టుల వద్ద 303 రైఫిల్స్ G3 రైఫిల్స్ ఎస్ ఎల్ ఆర్, ఏ కె 47 రైఫిల్స్, బుల్లెట్స్, క్యాట్రెజ్,తదితర ఆయుధా లను పోలీసులకు అందజేశారు.

లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, బీకే-ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పొలీసులకు లొంగిపోయారు. ఆయనతో సహా మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎదుట లొంగిపోయారు. 

ఈ మేరకు వీరి లొంగు బాటులో ఇవాళ హైదరాబాద్‍లో డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికం గా ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు. 

లొంగిపోయిన మావోయిస్టు లకు రివార్డు నగదుతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా ఏవోబీ ప్రాంతంలో మావో యిస్టు పార్టీ నిర్మాణంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్