నేడు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్?
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 25
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తై.. ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాయి.
ఇవాళ మధ్యాహ్నాం 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్‌కు అందినట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి డీపీవోలు మూడు సెట్ల గెజిట్ కాపీలను పంచాయతీరాజ్ కమిషన రేట్‌లోని హెల్ప్‌డెస్క్‌లో అందజేశారు.పంచాయతీరాజ్ అధికారులు ఈ గెజిట్ కాపీలను పరిశీలించి, వాటిని మూడు ప్రధాన విభాగాలకు అందజేశారు.
ఒక సెట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరొక సెట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CS రామకృష్ణా రావుకు, మిగిలిన కాపీలను రికార్డుల కోసం ఉంచారు. రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్‌లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోఈరోజు సాయంత్రం 6.15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించను న్నట్లు మీడియాకు సమాచారం అందింది.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుం డగా.. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకొని ఎస్‌ఈసీకి ఆదే శాలు జారీ చేయనున్నారు.
Comments
Post a Comment