తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు!
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 21
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... పోలీస్ శాఖలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. పాత ప్రభుత్వా నికి అనుకూలంగా ఉన్నా రని భావించిన లేదా?ఎన్ని కల కమిషన్ నిబంధనల ప్రకారం ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసిన అధికారు లను ఈ బదిలీల్లో భాగంగా కీలక స్థానాల నుంచి మార్చడం జరిగింది.
ఈ బదిలీల ద్వారా పలువురు యువ, డైనమిక్ అధికారులకు జిల్లాల్లోనూ, నగరంలోని కీలక విభాగా ల్లోనూ బాధ్యతలు అప్పగిం చారు.ఈ బదిలీలలో భాగంగా.. పోలీస్ శాఖలో ప్రధాన విభాగాలకు కొత్త సారథులను నియమించా రు. చౌహాన్ కి అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ పర్సనల్) వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించడం జరిగింది. రాష్ట్రంలోని హై-ప్రొఫైల్ కేసుల దర్యాప్తు బాధ్యతలు చూసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ సీఐడీ, డీఐజీగా పరిమిళా నూతన్ని నియమించారు.
శాంతిభద్రతల నిర్వహణలో అత్యంత ముఖ్యమైన స్థానాల్లో మార్పులు ఇలా ఉన్నాయి. మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించే తెలంగాణ నార్కొటిక్ ఎస్పీ గా పద్మ, నాగర్‌కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, తో పాటు..
ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, నగరంలో కీలకమైన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్ లు బదిలీ అయ్యారు.పోలీస్ శాఖలో కొత్త ఉత్సాహాన్ని నింపి.. పరిపాలనలో జవాబు దారీతనాన్ని పెంచడానికి ఈ మార్పులు దోహదపడ తాయని ప్రభుత్వ అంచనాలు.
Comments
Post a Comment