నేడు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల!

వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి

అమరావతి:నవంబర్ 19

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు నేడు 19వ తేదీ బుధవారం 21విడత నిధులు విడుదలl కానున్నాయి, మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నేరుగా రూ"2,000 చొప్పు న జమ కానున్నాయి...

వీటితోపాటు..అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు రూ.5వేలు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేరోజు రూ.7వేల నగదు జమ కానుంది.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. 

ఇందులో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92కోట్లు కాగా.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటా రూ. 972.09 కోట్లు ఉంటుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీయేటా మూడు విడతల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది. 

పిఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20వేలు జమ చేస్తామని చెప్పింది. తొలి విడత రూ.7వేలు, రెండో విడత రూ.7వేలు, మూడో విడత రూ.6వేలు ఇస్తా మని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలి సిందే. ఇందులో భాగంగా తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత డబ్బులు రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రెండు విడతల్లో కలిపి ఈ పథకం కింద మొత్తం రూ.6,309. 44 కోట్లు ప్రభుత్వం అందించినట్లవుతోంది.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్