అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు!

వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:నవంబర్ 21

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియోలకు జిహెచ్ఎంసి అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు అందించారు.

ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించింది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బయటపడింది.దీంతో పూర్తి స్తాయిలో ట్రేడ్ లైసెన్స్‌ ఫీజు చెల్లించాలి అంటూ రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాలి. 

అయితే.. కేవలం 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లుగా తేలింది. అలాగే రామానాయుడు స్టూడియో 1,92 లక్షలు చెల్లించవలసి ఉండగా కేవలం1900 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా గుర్తించారు. అందుకనే అన్నపూర్ణ, రామానాయు డు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్