కోచింగ్ కేంద్రాల కాసుల వేట..!
ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు. నిబంధనలు లేవు… నియంత్రణ లేదు. ఆదిలాబాద్ , వార్త నేత్రం ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ తీవ్రంగా పెరుగుతున్న ఈ కాలంలో కోచింగ్ సెంటర్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్క పోస్టుకు వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భంలో యువత , విద్యార్థులు కోచింగ్ కోసం సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కూడా ఎంతటి ఖర్చైనా వెనకాడడం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొన్ని కోచింగ్ సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను , వారి తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. ఐఐటీ , నిట్ , నీట్ , సివిల్స్ , గ్రూప్స్ , పోలీస్ , బ్యాంకింగ్ వంటి కోర్సుల పేరుతో కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తున్నామంటూ 50 నుండి 60 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సెంటర్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. హాస్టల్లో వుంటునా విద్యార్దులకు కనీస మౌలిక వసతుల...