. స్వీట్లలో హానికర రసాయనాలు – రంగులు . ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ ఆదేశాలు బేఖాతరు . పట్టించుకోని అధికారులు – ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వార్త నేత్రం ప్రతినిది ఆదిలాబాద్ : ఇంట్లో పండుగలు, శుభకార్యాలు, వేడుకలు ఏవైనా సరే ప్రజలు తమ ఆనందాన్ని స్వీట్లతో పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఆ స్వీట్లు మన ఆరోగ్యానికే ముప్పు తెస్తున్నాయి. ఆకర్షణీయంగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు విషపూరిత రంగులు, హానికర రసాయనాలు కలిపి స్వీట్లు తయారు చేస్తున్నారు. పండగల సీజన్లో అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఎక్కువ లాభాల కోసం వ్యాపారులు నాసిరకం నూనెలు, నెయ్యి వంటివి అధికంగా వినియోగిస్తున్నారు. వ్యాపారుల అత్యాశ వల్ల ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన స్వీట్ షాప్లు ఇప్పుడు మండలాలు, గ్రామాలకూ విస్తరించాయి.అంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు పండగల సీజన్లో కిలోల కొద్దీ కాదు, టన్నుల కొద్దీ అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టానుసా...
Comments
Post a Comment