Posts

Showing posts from January, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి,సర్కార్ భరోసా!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 10 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓ శుభవార్త అందించింది, ఉద్యోగుల సంక్షేమం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా స్పష్టం చేశారు.  కేవలం ప్రకటనలకే పరిమి తం కాకుండా.. ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే లోతైన సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్లు, ఇబ్బందుల ఉన్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల ను సైతం తాము అధికారం లోకి వ...

త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: జనవరి 09  చెక్ పోస్టులు ఎత్తేసిన రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు సిద్ధమవుతుంది, కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, త్వరలో వాహనం కొనుగోలు చేసిన షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు.  దీంతో రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇకపై బైక్, కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో  కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాహనాలు కొనుగోలు చేసిన షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేయనుంది, రవాణ శాఖ. ప్రైవేట్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ కొత్త విధానం అమలు కానుంది. *ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్..* ఇప్పటివరకు ఉన్న విధానంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు కేవలం తాత్కాలిక రిజి స్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రే షన్ కోసం రవాణశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చ...

గవర్నర్ కు బాంబు బెదిరింపు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ రాజ్‌భవన్, వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది,గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బెదిరింపును అధికా...

విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 శనివారం నుండి సెల వులు ప్రారంభమవుతాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, మరియు 16న కనుమ పండుగలు ఉన్నాయి. సాధారణంగా కనుమ రోజున ఐచ్ఛిక సెలవు ఉన్నప్పటికీ.. విద్యా ర్థులు తమ స్వగ్రామాలకు వెళ్లే సౌకర్యార్థం 16వ తేదీ వరకు పూర్తి సెలవులు పొడిగించారు.  పండుగ సెలవుల అనంతరం జనవరి 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాను న్నాయి. కళాశాలలు మాత్రం ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి అయితే.. జనవరి 19 న తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారిం చాలని బోర్డు సూచించింది. సెలవుల్లో ప్రత్యేక తరగతు లు...

ప్రియుడు అనుమానించాడని యువతి ఆత్మహత్య?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా జనవరి 08   ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోవడా నికి తల్లిదండ్రులను ఒప్పించాడు ఫోన్లో ఎవరితో నో  మాట్లాడుతున్నావని వేధించడంతో యువతి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) తన అన్న అరవింద్‌తో కలిసి తట్టి అన్నారంలొని వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటోంది. అయితే వీరికి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) తో పరిచయం ఏర్పడింది. ఐశ్వర్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కాగా సూర్యాపేటకు చెందిన వీరి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్,( 23) నగరంలోని హస్తినా పురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఆనంద్ దూర బంధువు కావడంతో పలుమార్లు ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు వీరిద్దరి మధ్య పరిచయం కూడా ఏర్పడింది..   ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూశాడు. అప్పటి నుంచి తరచూ ఐశ్వర్య ఇంటికి వచ్చేవాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తు న్నాన...

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ 2026 -27 ఆర్థిక బడ్జెట్!9వ సారి దేశ ఆర్థిక బడ్జెట్: రికార్డ్ సృష్టించబోతున్న నిర్మలమ్మ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది, జన వరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి....  అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆది వారం వచ్చినా సాంప్రదా యాన్ని కొనసాగించేలా ఆదివారం కూడా సభను నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా 9 వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డుసృష్టించ బోతున్నారు.. ఈసారి బడ్జెట్ అంచనాలు గతంతో పోలిస్తే భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం సుమారు రూ"11 నుండి 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లు,జాతీయ రహదారులు, పోర్టుల, అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ప్...

నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 రానున్న మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన సవరణలపై నిరసనలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది..  ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ అను బంధ సంస్థల అధ్యక్షులతో ఈరోజు విస్తృతస్థాయి సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహించనుంది...  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,అధ్యక్షత వహించనున్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ. 4.23 కోట్లు మంజూరు చేశారు.  అయితే, కేవలం 19 రోజులు మాత్రమే స్నాక్స్ అందించనుండటం పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శ లు వెల్లు వెత్తుతున్నాయి రాష్ట్రంలో జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. రాష్ట్రం లో 4,303 హైస్కూళ్లు ఉండగా.. వీటి ల్లో పదో తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు.  రోజుకు ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్ ను వెంటనే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుండి స్కూళ్లక...

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:జనవరి 07 ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పోలవరంలో బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు.  2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదల తో ఉన్న ప్రభుత్వం, నిర్మాణ దశలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని వీక్షించారు. అనంతరం నేరుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీల ఆర్ అండ్ ఆర్, అమలుప...

జనజీవన స్రవంతిలోకి మరో 26 మంది మావోయిస్టులు!

Image
 వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్: జనవరి 07 ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సూక్మ జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది, జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్,ఎదుట బుధవారం మరో 26 మంది మావో యిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల కోటగా పిలవబడే బస్తర్ రీజియన్‌లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది  జనజీవన స్రవంతిలోకి రావాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు పోలీసుల పూన నర్కోమ్,కొత్త ఉదయం ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా ఆయు ధాలు వీడుతున్నారు. *కీలక నేతలు.. రూ. 64 లక్షల రివార్డు* లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి ప్రస్థానం పై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. లొంగిపోయిన 26 మందిపై కలిపి ప్రభు త్వం 64 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ సభ్యులుగా గుర్తించబడ్డారు. ఛత్తీస్‌గఢ్ పోలీసు యంత్రాంగం, సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంద...

మాజీ మంత్రి హరీష్ రావు,కు సుప్రీంకోర్టులో ఊరట!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 05 తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు, ఈరోజు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావులపై చర్యలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తూ, గతంలో ఈ కేసుకు సంబంధించి ఉన్న న్యాయ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది. పిటిషన్లు కొట్టివేత ఈ సందర్భంగా, ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లను కూడా తాము ఇప్పటికే కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను హైకోర్టు గతంలో స్టే చేయడం, లేదా కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప...

పునరాలోచన లేదు నా రాజీనామాను ఆమోదించండి :ఎమ్మెల్సీ కవిత! అసెంబ్లీ లో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత!

Image
వార్త నేత్రం  :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 05 ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యా రు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. తనకు ఎదురైన అనుభ వాలను శాసనమండలిలో తెలుపుతూ..ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.నాలుగు కోట్ల మంది ప్రజలకు 40మంది ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ అవకాశం దక్కినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కవిత అన్నారు.  బీఆర్ఎస్ పార్టీతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. 20ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిని నేను. 2006 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మన బతుకమ్మ మన గౌరవంను చాటిచెప్పే విధంగా ఊరూ రా తిరిగామని, మన భాష ను యాషను కాపాడుకునే విధంగా పోరాటాలు చేశామని కవిత అన్నారు. 2004లో అమెరికాలో ఉద్యోగాలు చేశాను. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఇతర దేశాల్లో ఉన్న రాష్ట్రానికి యువత రావటం జరిగింది. ఆ సమయంలో నేను కూడా ఉద్యమం కోసం వచ్చానని కవిత అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం 2013లో కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి గల అంశాలపైన ఢిల్లీకి ఆహ్వానిం...

మహిళలకు పాడి పరిశ్రమలు?

Image
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 02 తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి, సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతో పాటు.. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదా యం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందు కు ఇందిరా డెయిరీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళా స్వయం సహా యక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండేసి పాడి గేదెలు లేదా ఆవులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమ వుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం నాలుగు లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగు మతి చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో పాడి పరి శ్రమను ప్రోత్సహ...