విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు!


వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 09

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 శనివారం నుండి సెల వులు ప్రారంభమవుతాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, మరియు 16న కనుమ పండుగలు ఉన్నాయి. సాధారణంగా కనుమ రోజున ఐచ్ఛిక సెలవు ఉన్నప్పటికీ.. విద్యా ర్థులు తమ స్వగ్రామాలకు వెళ్లే సౌకర్యార్థం 16వ తేదీ వరకు పూర్తి సెలవులు పొడిగించారు. 

పండుగ సెలవుల అనంతరం జనవరి 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాను న్నాయి. కళాశాలలు మాత్రం ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి అయితే.. జనవరి 19 న తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారిం చాలని బోర్డు సూచించింది.

సెలవుల్లో ప్రత్యేక తరగతు లు నిర్వహించే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ హెచ్చరించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు DEO లు దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచనున్నారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్