పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్?
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:జనవరి 08
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ. 4.23 కోట్లు మంజూరు చేశారు.
అయితే, కేవలం 19 రోజులు మాత్రమే స్నాక్స్ అందించనుండటం పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శ లు వెల్లు వెత్తుతున్నాయి రాష్ట్రంలో జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. రాష్ట్రం లో 4,303 హైస్కూళ్లు ఉండగా.. వీటి ల్లో పదో తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు.
రోజుకు ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్ ను వెంటనే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుండి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నా రు. మరోవైపు పదో తరగతి స్పెషల్ క్లాసులు అక్టోబర్, నవంబర్, మాసాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 19రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులపై ఉపాధ్యా య సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది టెన్త్ విద్యార్థులకు 39రోజుల పాటు స్నాక్స్ అందించారని, ఈ ఏడాది కేవలం 19 రోజులే ఇవ్వడం సరికాదని టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం పేర్కొంది. స్నాక్స్ ను 45రోజులకు పెంచాలని డిమాండ్ చేసింది. 19 రోజులు కాకుండా చివరి పరీక్ష వరకు విద్యార్థులకు స్నాక్స్ ను సమకూర్చాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయ సం ఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుం టుందో చూడాలి మరి!
Comments
Post a Comment