త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్: జనవరి 09
చెక్ పోస్టులు ఎత్తేసిన రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు సిద్ధమవుతుంది, కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, త్వరలో వాహనం కొనుగోలు చేసిన షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు.
దీంతో రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇకపై బైక్, కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాహనాలు కొనుగోలు చేసిన షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేయనుంది, రవాణ శాఖ. ప్రైవేట్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ కొత్త విధానం అమలు కానుంది.
*ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్..*
ఇప్పటివరకు ఉన్న విధానంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు కేవలం తాత్కాలిక రిజి స్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రే షన్ కోసం రవాణశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. మళ్లీ నెంబర్ ప్లేట్ కోసం డీలర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తోంది. ఈ పద్ధతితో వాహన దారులు ఇబ్బం దులు పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేలా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది...
ప్రభుత్వం. వాహనం కొన్న షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేట్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త విధానం అమలు కానుంది. వాణిజ్య కమర్షియల్, వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం ఎప్పటి లానే ఆర్టీవో కార్యాలయా ల్లోనే జరుగుతాయి.
కొత్త విధానం అమల్లోకి వస్తే షోరూమ్‌లోనే కొనుగోలు దారుడి వివరాలను వాహన్ పోర్టల్‌లో డీలర్ నమోదు చేస్తారు. రవాణ శాఖ అధికారి డిజిటల్ అనుమతి ఇచ్చిన వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవు తుంది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్ల రిజిస్ట్రే షన్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవాణ, రహదారి మంత్రిత్వశాఖ పరిధిలోని వాహన్-సారథి పోర్టల్స్ ద్వారా షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
Comments
Post a Comment