జనజీవన స్రవంతిలోకి మరో 26 మంది మావోయిస్టులు!


 వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి
 హైదరాబాద్: జనవరి 07

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సూక్మ జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది, జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్,ఎదుట బుధవారం మరో 26 మంది మావో యిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల కోటగా పిలవబడే బస్తర్ రీజియన్‌లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది 

జనజీవన స్రవంతిలోకి రావాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు పోలీసుల పూన నర్కోమ్,కొత్త ఉదయం ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా ఆయు ధాలు వీడుతున్నారు.

*కీలక నేతలు.. రూ. 64 లక్షల రివార్డు*

లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి ప్రస్థానం పై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. లొంగిపోయిన 26 మందిపై కలిపి ప్రభు త్వం 64 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ సభ్యులుగా గుర్తించబడ్డారు.

ఛత్తీస్‌గఢ్ పోలీసు యంత్రాంగం, సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంది, అభివృద్ధి వైపు మొగ్గు చూపుతూ వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయం అందించి, పునరావాసం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఇటీవలి కాలంలో ఛత్తీస్‌ గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత చర్యలు వేగవంతం కావడం, కీలక ఎన్‌కౌంటర్లు జరగడంతో దళ సభ్యులలో అభద్రతాభావం పెరిగి లొంగుబాట్లు కొనసాగుతు న్నాయి.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్