నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశం!
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:జనవరి 08
రానున్న మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన సవరణలపై నిరసనలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది..
ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ అను బంధ సంస్థల అధ్యక్షులతో ఈరోజు విస్తృతస్థాయి సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహించనుంది...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,అధ్యక్షత వహించనున్నారు.
Comments
Post a Comment