ప్రియుడు అనుమానించాడని యువతి ఆత్మహత్య?


వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా జనవరి 08 

 ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోవడా నికి తల్లిదండ్రులను ఒప్పించాడు ఫోన్లో ఎవరితో నో  మాట్లాడుతున్నావని వేధించడంతో యువతి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) తన అన్న అరవింద్‌తో కలిసి తట్టి అన్నారంలొని వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటోంది. అయితే వీరికి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) తో పరిచయం ఏర్పడింది. ఐశ్వర్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది.

కాగా సూర్యాపేటకు చెందిన వీరి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్,( 23) నగరంలోని హస్తినా పురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఆనంద్ దూర బంధువు కావడంతో పలుమార్లు ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు వీరిద్దరి మధ్య పరిచయం కూడా ఏర్పడింది..  

ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూశాడు. అప్పటి నుంచి తరచూ ఐశ్వర్య ఇంటికి వచ్చేవాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తు న్నానని, పెళ్లి చేసుకుంటా నని వెంటపడ్డాడు. దాంతో ఆ యువతి ఒప్పుకుంది. అయితే వారి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించారు. తర్వాత నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. 

ఈ క్రమంలో ఐశ్వర్య మరెవరితోనో ఫోన్లో మాట్లాడుతోందని ఆనంద్‌ అనుమానం పెంచుకున్నా డు. జనవరి 5వ తేదీన హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్దకు ఇద్దరు చేరుకొని మాట్లాడుకున్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్న వని అనుమానం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది... 

మనస్థాపానికి చెందిన ఐశ్వర్య వెంటనే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకేసింది. వెంటనే ఆమెను నాగోల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్