గవర్నర్ కు బాంబు బెదిరింపు?
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:జనవరి 09
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ రాజ్‌భవన్, వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది,గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.
గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బెదిరింపును అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.
Comments
Post a Comment