ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి,సర్కార్ భరోసా!



వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 10

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓ శుభవార్త అందించింది, ఉద్యోగుల సంక్షేమం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా స్పష్టం చేశారు. 

కేవలం ప్రకటనలకే పరిమి తం కాకుండా.. ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే లోతైన సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్లు, ఇబ్బందుల ఉన్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల ను సైతం తాము అధికారం లోకి వచ్చాక ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తున్నామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. జీతాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు, ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్సులను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

ఈ బీమా పథకం ద్వారా విధి నిర్వహణలో లేదా ఇతర ప్రమాదాల్లో దురదృష్టవశాత్తూ ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని కీలక రంగాల్లో పనిచేస్తున్న సింగరేణి, విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ఈ తరహా కోటి రూపాయల బీమా రక్షణ కవచం అమలవుతోందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 38 వేల మంది రెగ్యులర్ కార్మికులతో పాటు, విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ఇప్పటికే ఈ ప్రయోజనం అందుతోంది. 

వారి మాదిరిగానే సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 5.14 లక్షల మంది ఉద్యోగులకు కూడా రూ. 1.02 కోట్ల ప్రమాద బీమాను త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్