మాజీ మంత్రి హరీష్ రావు,కు సుప్రీంకోర్టులో ఊరట!

వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 05

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు, ఈరోజు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావులపై చర్యలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తూ, గతంలో ఈ కేసుకు సంబంధించి ఉన్న న్యాయ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది.
దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది.

పిటిషన్లు కొట్టివేత
ఈ సందర్భంగా, ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లను కూడా తాము ఇప్పటికే కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను హైకోర్టు గతంలో స్టే చేయడం, లేదా కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం తెలిసిందే.

ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్పటికీ హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేయలేమని పేర్కొంటూ పిటిషన్లను కొట్టేసింది.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్