తియ్యని విషం ..!
. స్వీట్లలో హానికర రసాయనాలు – రంగులు
. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ ఆదేశాలు బేఖాతరు
. పట్టించుకోని అధికారులు – ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
వార్త నేత్రం ప్రతినిది ఆదిలాబాద్ :
ఇంట్లో పండుగలు, శుభకార్యాలు, వేడుకలు ఏవైనా సరే ప్రజలు తమ ఆనందాన్ని స్వీట్లతో
పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఆ స్వీట్లు మన ఆరోగ్యానికే ముప్పు తెస్తున్నాయి.
ఆకర్షణీయంగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు విషపూరిత రంగులు, హానికర
రసాయనాలు కలిపి స్వీట్లు తయారు చేస్తున్నారు. పండగల సీజన్‌లో
అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఎక్కువ లాభాల కోసం వ్యాపారులు నాసిరకం నూనెలు,
నెయ్యి వంటివి అధికంగా వినియోగిస్తున్నారు. వ్యాపారుల అత్యాశ వల్ల ప్రజలు అనేక రకాల రోగాల
బారిన పడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన స్వీట్ షాప్‌లు ఇప్పుడు మండలాలు,
గ్రామాలకూ విస్తరించాయి.అంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు
పండగల సీజన్‌లో కిలోల కొద్దీ కాదు, టన్నుల కొద్దీ అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి పై
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ ఆదేశాలు బేఖాతరు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) 2020 అక్టోబర్ 1 నుంచి అన్ని స్వీట్
షాపులు ప్యాక్ చేయని లేదా వదులు స్వీట్ల ట్రేలు, కంటైనర్లపై “బెస్ట్ బిఫోర్” తేదీని తప్పనిసరిగా
ప్రదర్శించాలని ఆదేశించింది.
వ్యాపారులు స్థానిక పరిస్థితులను బట్టి స్వీట్ల “బెస్ట్ బిఫోర్” తేదీ నిర్ణయించి చూపాలని
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ స్పష్టంగా తెలిపింది. అయితే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఈ నిబంధనలు
ఎక్కడా అమలు కావడం లేదు.
ఇటీవలి కాలంలో పలు నగరాల్లో జరిగిన దాడుల్లో లేబుల్ లేని స్వీట్లు, ఒకటి రెండు రోజులకే
గడువు ముగిసే తినుబండారాలు, హానికర రసాయనాలు కలిగిన స్వీట్లు భారీగా పట్టుబడ్డాయి.
గత సంవత్సరం అదిలాబాద్‌లోని ఒక ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతా అధికారులు దాడి
చేసి, పాడైపోయిన స్వీట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నాశనం చేసి కేసు నమోదు చేశారు
. కానీ నెలరోజులకే అదే షాప్‌లో ఓ వినియోగదారుడికి స్వీట్‌లో చనిపోయిన బొద్దింక కనిపించింది
. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఘటనలు అదిలాబాద్‌లో ఒక్కటే కాదు — ఇంకా
ఎన్నో బయటపడని ఉదంతాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే
వ్యాపారుల లాభాలకే ప్రాధాన్యత ఇస్తునారాని పలు వినియోగదారుల సంఘాలు ఆరోపిస్తునాయి.
గడువు ముగిసిన కృత్రిమ రంగులు, రసాయన పదార్దాలు కలిపిన స్వీట్లు తింటే ఆరోగ్యానికి
ముప్పు!
. నిపుణుల హెచ్చరిక – జాగ్రత్తలు పాటించాలి
గడువు ముగిసిన కృత్రిమ రంగులు, రసాయన పదార్దాలు కలిపిన స్వీట్లు తినడం ఆరోగ్యానికి
తీవ్రమైన ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన విధంగా నిల్వ చేయని లేదా
పాడైపోయిన స్వీట్లు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు.
ఎక్స్పైరీ అయిన స్వీట్లలో హానికరమైన బాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువ. ఇవి ఆహార
విషపాతానికి దారితీస్తాయి. ఫలితంగా వాంతులు, తలనొప్పి, పొట్ట నొప్పి, మెడదిబ్బ, డయేరియా
వంటి సమస్యలు వస్తాయి. విషపాతం ఎక్కువైతే జ్వరం కూడా రావచ్చు. స్వీట్లపై పచ్చని లేదా
తెల్లని పూత (మోల్డ్), వింత వాసన, రుచి మారితే వెంటనే వదిలేయాలని నిపుణులు
సూచిస్తున్నారు.
ఎక్స్పైరీ అయిన స్వీట్లు తినడం పిల్లలు, వృద్ధులు, అలెర్జీలు ఉన్నవారికి మరింత ప్రమాదకరమని
నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్వీట్లు కొనుగోలు చేసే
ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.
గడువు ముగిసిన, కృత్రిమ రంగులు, రసాయన పదార్దాలు కలిపిన స్వీట్లు తింటే ఆరోగ్యానికి ముప్పు!
నిపుణుల హెచ్చరిక – జాగ్రత్తలు
పాటించాలి
గడువు ముగిసిన కృత్రిమ
రంగులు, రసాయన పదార్దాలు కలిపిన స్వీట్లు
తినడం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన
విధంగా నిల్వ చేయని లేదా పాడైపోయిన స్వీట్లు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయని
వారు చెబుతున్నారు.
ఎక్స్పైరీ అయిన స్వీట్లలో
హానికరమైన బాక్టీరియా, ఫంగస్ పెరిగే
అవకాశం ఎక్కువ. ఇవి ఆహార విషపాతానికి దారితీస్తాయి. ఫలితంగా వాంతులు, తలనొప్పి, పొట్ట నొప్పి, మెడదిబ్బ, డయేరియా వంటి
సమస్యలు వస్తాయి. విషపాతం ఎక్కువైతే జ్వరం కూడా రావచ్చు. స్వీట్లపై పచ్చని లేదా
తెల్లని పూత (మోల్డ్), వింత వాసన, రుచి మారితే వెంటనే వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్స్పైరీ అయిన స్వీట్లు
తినడం పిల్లలు, వృద్ధులు, అలెర్జీలు ఉన్నవారికి మరింత ప్రమాదకరమని
నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్వీట్లు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా తనిఖీ చేయాలని
సూచిస్తున్నారు.
FSSAI సూచించిన స్వీట్ల గడువు (Shelf Life):
మిఠాయి రకం ఉదాహరణలు నిల్వ కాలం (సుమారుగా) నిల్వ విధానం
ఖోవా / మావా ఆధారిత గులాబ్ జామున్, బర్ఫీ, పెడా, కలాకండ్ 2–4 రోజులు ఫ్రిజ్‌లో (≤ 5°C) ఉంచాలి
చెన్నా ఆధారిత రసగుల్లా, సందేశ్, చమ్ చమ్ 1–3 రోజులు ఫ్రిజ్‌లో ఉంచాలి
నెయ్యి / పొడి మిఠాయిలు మైసూర్ పాక్, డ్రై ఫ్రూట్ బర్ఫీ 7–15 రోజులు గది ఉష్ణోగ్రత వద్ద పొడి ప్రదేశంలో
వేయించినవి జిలేబీ, బాలూషాహీ, ఇమర్తి 1–2 రోజులు గాలి చొరబడని డబ్బాలో
పొడి లడ్డు రకాలు బూందీ లడ్డు, బేసన్ లడ్డు 10–20 రోజులు గాలి చొరబడని డబ్బాలో
కొబ్బరి మిఠాయిలు కొబ్బరి బర్ఫీ, నారియల్ లడ్డు 5–7 రోజులు ఫ్రిజ్‌లో ఉంచాలి
________________________________________
ప్యాక్ చేసిన మిఠాయిలు
రకం నిల్వ కాలం గమనికలు
పాలు ఆధారిత (వాక్యూమ్ ప్యాక్) 15–30 రోజులు 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి
పొడి మిఠాయిలు (ప్యాక్ చేసినవి) 30–90 రోజులు తేమ రాకుండా ఉంచాలి
హల్వా (ప్యాక్ చేసినది) 30–60 రోజులు నూనె కారణంగా ఎక్కువ కాలం నిలుస్తుంది
చాక్లెట్ / కన్ఫెక్షనరీ 6–12 నెలలు చల్లని, పొడి ప్రదేశంలో (18–22°C)
బేకరీ మిఠాయిలు 3–5 రోజులు (తాజా), 6 నెలల వరకు (ప్యాక్ చేసినవి) ఫ్రిజ్ లేదా వాక్యూమ్ ప్యాక్‌లో ఉంచాలి
అలాగే ప్యాక్ చేసిన స్వీట్లపై “తయారీ తేదీ”, “బెస్ట్ బిఫోర్” వివరాలు స్పష్టంగా ప్రస్తావించడం తప్పనిసరి.
స్వీట్ షాప్‌లలో పనిచేసే ఉద్యోగులు గ్లౌజులు, హెయిర్ క్యాప్స్ ధరించడం కూడా ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ నిబంధనల్లో భాగమే.
కానీ అదిలాబాద్ జిల్లాలో ఈ నియమాలను ఎవరు పాటించడం లేదు.
వినియోగదారుల కోసం సూచనలు
• స్వీట్లు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, బెస్ట్ బిఫోర్ తేదీ తప్పక చూడాలి.
• పాలు ఆధారిత మిఠాయిలను వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి.
• వాసన, రంగు మారిన లేదా తేమతో ఉన్న మిఠాయిలను తినకూడదు.
• పండుగ సీజన్‌లో ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే కొనుగోలు చేయాలి.
జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రతూషా మాట్లాడుతూ —
“ఇప్పటివరకు కల్తీ నూనె లేదా హానికర రసాయనాలపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. అయితే
ఫిర్యాదు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే స్వీట్ షాప్ యజమానులతో
సమావేశం ఏర్పాటు చేసి, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ నియమాలపై అవగాహన కల్పిస్తాం. అన్ని షాప్‌లలో
‘తయారీ తేది – బెస్ట్ బిఫోర్’ ప్రదర్శన తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటాం” అని
తెలిపారు.
వినియోగదారుల సంఘం ప్రతినిధి సుభాష్ మాట్లాడుతూ —
“ప్రభుత్వ ఆదేశాలు వచ్చి ఐదేళ్లు అయినా అదిలాబాద్ జిల్లాలో అమలు కాని స్థితి కొనసాగుతోంది.
పలు సార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇకనైనా కఠిన చర్యలు
తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్న వ్యాపారులను
నియంత్రించాలి” అని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రజలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ “రోజువారీ తినే స్వీట్ల నాణ్యతపై పర్యవేక్షణ
లేకపోవడం ఆందోళనకరం. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి”
అని కోరుతున్నారు.



Comments
Post a Comment