బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...
మసాలా గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా
అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యాను
బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...
అదిలాబాద్ వార్త నేత్రం : బేల మండలంలోని మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యానని.. ఇందుకు మసాలా గ్రామ ప్రజలు ఎంతో మద్దతు ఇచ్చారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మసాలా గ్రామ మాజీ సర్పంచ్ ప్రజలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆద్వర్యం లో బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిజెపి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో శంకరన్న ని వెంట మేముంటామంటూ ఆనాడు ధైర్యం ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం గానే గ్రామ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. గత పది ఏళ్ళు కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేనని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల అయిన తర్వాత మరో మాట మాట్లాడారని గుర్తు చేశారు. అదేవిధంగా నేడు కాంగ్రెస్ పార్టీ అదే పాలన కొనసాగిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఆదివాసుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం, ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వం నిధులను పక్కదోవ పట్టించిందన్నారు. ఇక్కడ ఉన్న ఆదివాసులకు బోర్ వేల్ మోటారు మీటర్లు కావాలనుకున్నవారు జిల్లా కార్యాలయనికి రావాలని సూచించారు సంబంధిత అధికరులతో మాట్లాడి ఆదివాసులకు కావలసిన బోర్వెల్ ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు దత్త నిక్కం రాకేష్ మోరేశ్వర్ గణేష్ నవీన్ శ్రీకాంత్ గంభీర్ హరీష్ రాము తదితరులు

Comments
Post a Comment