క్రీడలతో మానసిక ఉల్లాసం .... ఎమ్మెల్యే పాయల్ శంకర్
వార్త నేత్రం అదిలాబాద్ :
క్రీడలతో శారీరక దృఢత్వం పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.మంగళవారం జైనథ్ మండలం లోని ప్రసిద్ధి చెందిన లక్ష్మి నారాయణ స్వామి జాతర సందర్భంగా జైనథ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... క్రీడల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రత్యేక కార్యచరణను రూపొందించారు అని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలలో క్రీడాకారులకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో నివేదికలు తయారుచేసి వాటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ చర్చ ప్రస్తావన కొచ్చినప్పుడు వెనుకబడిన అదిలాబాద్ జిల్లాకు విధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మండలాలలో మినీ స్టేడియం లో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఏ ఒక్కటి కూడా స్టేడియం మంజూరు చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాటలే ఒకే పరిమితమైందని ఈ ప్రభుత్వం అలాకాకుండా కార్యచరణ రూపొందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాలే కాదు క్రీడల పట్ల మక్కువగా ఉన్న గ్రామాలలో క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో సైతం పోటీలలో పాల్గొంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలామంది క్రీడాకారులకు సహకారం అందడం లేదన్నారు. కే లో ఇండియా లో ఆదిలాబాద్ కు ప్రత్యేక స్థానం ఇవ్వాలని ఉద్దేశంతో అదిలాబాదును ఎంపిక చేయడం జరిగిందన్నారు. కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి క్రీడాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అదీనాథ్ .రాందాస్ అశోక్ రెడ్డి రాకేష్ రెడ్డి రమేష్ రెడ్డి .ప్రతాప్ ముకుంద్ . అశోక్.. బిజెపి నాయకులు ఒక ఇతరులు ఉన్నారు

Comments
Post a Comment