తెలంగాణలో డ్రైవింగ్‌ టెస్టుల్లో ఇక AI






హైదరాబాద్‌, వార్త నేత్రం ప్రతినిధి: 

రోడ్డు ప్రమాదాలను తగ్గించి రహదారి భద్రతను మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం నిర్వహించే పరీక్షలను మరింత కఠినంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృత్రిమ మేధ (AI) ఆధారిత వీడియో అనలిటిక్స్‌ సాంకేతికతను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తొలి దశలో రాష్ట్రంలోని ఆరు డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.ఈ విధానంలో డ్రైవింగ్‌ పరీక్ష సమయంలో హై-రిజల్యూషన్‌ కెమెరాలు, వీడియో అనలిటిక్స్‌, రియల్‌టైమ్‌ డేటా విశ్లేషణ వంటి సాంకేతికతలను వినియోగించే అవకాశం ఉంది. అభ్యర్థి వాహనాన్ని ఎలా నడుపుతున్నారు, నిర్దేశిత ట్రాక్‌లో డ్రైవింగ్‌ నిబంధనలను పాటిస్తున్నారా అనే అంశాలను సాంకేతిక వ్యవస్థ విశ్లేషించి పరీక్ష ఫలితాలను రూపొందించే విధానం ఇప్పటికే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలులో ఉంది. ఇటువంటి ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ల ఉద్దేశ్యం మానవ జోక్యాన్ని తగ్గించి పరీక్షల్లో ఏకరీతి, పారదర్శకత తీసుకురావడం.మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ భాగస్వామ్యంతో ఈ సాంకేతికతను అమలు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రవాణా శాఖ ఇప్పటికే డ్రైవింగ్‌ టెస్ట్‌ స్లాట్‌ బుకింగ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే డ్రైవింగ్‌ నైపుణ్యాల అంచనా మరింత సాంకేతికత ఆధారితంగా మారే అవకాశం ఉంది. రహదారి భద్రతను బలోపేతం చేయడంతో పాటు, నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్‌ చేయగల అభ్యర్థులకే లైసెన్స్‌ జారీ చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.


Comments

Popular posts from this blog

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

తియ్యని విషం ..!

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...