విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 28

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది,ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమా న ప్రమాదంలో కన్నుమూ శారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం లో ల్యాండింగ్ సమయం లో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానం లో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయా రు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్ప రిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమా దం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్ప కూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

ఈక్రమంలోనే విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సమాచారం అందిన వెంట నే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి,

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!