Posts

Showing posts from March, 2026

తెలంగాణ అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా బిల్లు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మార్చి 28 తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు సిద్ధం చేసింది, శనివారం శాసన సభలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీ తనం పర్యవేక్షణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టనుంది... దీంతోపాటు..తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి 103, 104వ వార్షిక రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ తర్వాత.. తెలంగాణ పంచాయతీ రాజ్‌-2026 అమెండ్మెంట్‌ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. వృద్ధ దంపతులకు ఆర్థిక భరోసా బిల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2026-27 బడ్జెట్‌ గ్రాంట్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ఇక.. గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇస్తారు.  ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ...

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి!l అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం.

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి :మార్చి 28 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని, మరియు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రా నికి స్థిరత్వం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  తీర్మానంలో కేంద్రాన్ని రాజధానికి చట్టబద్ధత కల్పించమని కోరుతూ కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఏర్పరచడం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశ్యం. అమరావతి రాజధానిగా కొనసాగడానికి అవసర మైన అన్ని రక్షణాత్మక చర్యలను కూడా తీసుకోవాలని తీర్మానంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు… ఇది భవిష్యత్తులో రాజధాని పనులు, సౌకర్యాలు, భద్రతా విధానాలకు మద్దతుగా ఉంటుంది. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణలు చేసి రాజధాని స్థానం విషయంలో స్పష్...