త్వరలో టీచర్లకు కొత్త నిబంధనలు!



వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:మే 04

విద్యార్థులకు నిత్యం సమయపాలనతొ పాటు...క్రమశిక్షణ నేర్పించవలసిన ఉపాధ్యాయులే పాఠ శాలలకు ఆలస్యంగా వస్తున్నారని, తెలు స్తుంది, అందరూ కాకపోయినా ఇలా కొద్ది మంది మాత్రం ప్రతిరోజు ఆలస్యం గానే విధులకు హాజ రవుతున్నట్లు హాజరు గుణంకాలే చెప్తున్నా యి.. ఉద్యోగుల హాజరు విషయంలో ఇకనుండి సీరియస్‌గా ఉంటామని,పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. 

లేట్‌గా వస్తే క్యాజువల్‌ లీవ్స్‌, ఆర్జిత సెలవు లకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఉద్యోగు లంతా ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌,ను నమోదుచేయాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. 

నెలవారీ హాజరు లెక్కింపు విషయం లోఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరి గణనలోకి తీసుకుంటా మని స్పష్టంచేసింది. ఉద్యోగులకు ఏడాది లో 15 సాధారణ సెలవులు సీఎల్స్‌, 30 ఆర్జిత సెలవులు ఈఎల్స్‌, ఉంటాయి. విధులకు ఆలస్యంగా వస్తే ముందుగా క్యా జువల్‌ లీవులకు కోత పెట్టనున్నారు. అయి పోయాక ఈఎల్స్‌లో కోత పెడుతారు. 

కార్యాలయ సూపరిం టెండెంట్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు కార్యాలయ ఎస్టాబ్లి ష్‌మెంట్‌ విభాగం అధి కారులు ఉద్యోగుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు, సెలవుల ఖాతాలను నిర్వహించి అవసర మైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హాజరు వివరాలను ప్రతి నెల 20వ తేదీలోపు అకౌం ట్స్‌ ఆఫీసర్‌కు నివేదిక సమర్పించాలని సూచించారు.

*నిబంధనల వివరాలు...!*

ఉద్యోగులను ఉద యం 10.40గంటల వరకే అనుమతిస్తారు. ఆ సమయంలోపే ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో లాగిన్‌కావాలి.
ఉదయం 10.41 గంటల నుంచి ఉద యం 11. 30 గంటల వరకు వచ్చే వారి విషయంలో అత్యంత కఠినంగా ఉంటారు. నెలలో మూడు రోజులు ఇలా లేట్‌ వస్తే ఒక క్యాజు వల్‌ లీవ్‌ (సీఎల్‌) కింద పరిగ ణిస్తారు. సీఎల్స్‌ను కట్‌చేస్తారు.

ఉద్యోగులు సాయం త్రం ఐదు గంటల తర్వాతే కార్యాలయా లు వదిలివెళ్లాలి. సా యంత్రం 4 గంటల్లోపు కార్యాలయం వదిలి వెళ్తే ఒక పూట ఆఫ్‌డే, క్యాజువల్‌ లీవ్‌గా పరి గణిస్తారు.. సాయంత్రం 4 -5 గంటల మధ్యలో కార్యాలయం వదిలి వెళ్లినా డుమ్మా కిందే పరిగణిస్తారు. 

ఇలా వరుసగా మూ డు రోజులు ముందు వెళితే ఒక క్యాజువల్‌ లీవ్‌ సీఎల్‌, గా పరిగణి స్తారు.బయట ఏదైనా శాఖపరమైన పని ఉంటే సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి. లేదంటే డుమ్మా కొట్టినట్టుగానే పరిగణించి సెలవులు, లేదంటే జీతం కట్‌చేస్తారు.

*టీచర్లకూ.. ఇదే నిబంధనలు!*

విద్యాశాఖ డైరెక్టరేట్‌ లో పనిచేసే బోధనేతర సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు విషయంలో విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. అయితే ఇవే నిబంధ నలను టీచర్లకు సైతం వర్తింపజేస్తారనే ప్రచా రం జరుగుతున్నది. రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లు ఉన్నారు. వీరికి సైతం ఎఫ్‌ఆర్‌ ఎస్‌ హాజరును అమలు చేస్తున్నారు. అయితే సెలవులు, జీతానికి కోత పెట్టడం లేదు. కొందరు టీచర్లు అదే పనిగా విధులకు గైర్హాజరవుతున్నారు.

ఇటీవలే జోగుళాంబ గద్వాల జిల్లాలో 76 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. మిగతా జిల్లాల్లోనూ కొందరికి నోటీసులిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇంత వరకు ఆన్‌డ్యూటీ ఇవ్వలేదు. కానీ సంఘాల నాయకుల్లో అత్యధికంగా విధుల కు దూరంగా ఉంటు న్నట్లు ప్రభుత్వం గుర్తించింది, 

దీనిని సీరియస్‌గా పరిగణిస్తారనే వాద నలు వినిపిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంకాగానే ఆలస్యంగా వెళ్లిన టీచర్ల సీఎల్స్‌, ఈ ఎల్స్‌కు కోత పెట్టబోతు న్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. చూడాలి మరి!

Comments

Popular posts from this blog

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!