ఈ విషయం మీకు తెలుసా ?

ప్రమాదంలో...ఆర్థిక భరోసా


మూడేళ్లు ఐటీ రిటన్స్ దాఖలు చేస్తే పదిరెట్ల పరిహారం.


ఆదిలాబాద్: మూడేళ్ల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలుచేసిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి ఆదాయాన్ని బట్టి పది రెట్లు పరిహారం పొందే అవకాశం ఉందని ఆంగకులోని మిట్స్  ఇంజినీరింగ్ కళాశాల అడ్మిని స్టేటివ్ ఆఫీసర్ వాహన చటం,అవగాహన దారు ఎంహెచ్ దాదాపీరి,తెలిపారు  ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక భరోసా విషయం చాలామందికి తెలియక నష్టపోతున్నారని పేర్కొన్నారు .ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మూడేళ్ల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉండాలన్నారు ఆ వ్యక్తి ప్రమాదవ శాత్తు మరణిస్తే అతని వార్షిక ఆదాయాన్ని బట్టి పదిరెట్లు పరిహారం ఆదాయాన్ని ఇవ్వాలని మోటారు వాహన చటం చెబుతోందన్నారు ఒక వ్యక్తి వార్షిక ఆదాయం ..రూ.5 లక్షలు ఉంటే అతను ప్రమాదవశాతు మరణిసే వారి కుటుంబానికి పదిరెట్లు అంటే రూ.50 లక్షలు పరిహారం లభిస్తుందన్నారు.ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపు కైం చేసుకోవాలన్నారు దీనిపై ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!