తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలరేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ!
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27 తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది 116 మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మంగళవారం సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్ని కల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మెుదలు కానుం ది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న నిర్వ హించ...