తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలరేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ!



వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 27

 తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది 116 మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మంగళవారం సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్ని కల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. 

ఈ నేపథ్యంలోనే  నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మెుదలు కానుం ది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 

ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న నిర్వ హించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటిం చనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌ఫర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయ ర్ ఎన్నిక ఉండనుంది.

2996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణం లో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామ న్నారు. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎ స్, బీజేపీలకు ఈ ఎన్ని కలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంద నేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

1)నామినేషన్ల స్వీకరణ -జనవరి 28 నుంచి 30 వరకు

2)నామినేషన్ల పరిశీలన -జనవరి 31

3)నామినేషన్ల ఉపసంహరణ - ఫిబ్రవరి 3

4)పోలింగ్ - ఫిబ్రవరి 11

5)ఫలితాల వెల్లడి - ఫిబ్రవరి 13

6)మేయర్, ఛైర్ పర్సన్‌ల ఎన్నిక - ఫిబ్రవరి 16.

Comments