నేడు గ్రూప్-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
వార్త నేత్రం ప్రతినిధి: హైదరాబాద్ Jan 22, నేడు గ్రూప్-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ తెలంగాణ : తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షపై గురువారం తీర్పు వెల్లడించనుంది. ఉదయం 11 గంటలలోపు ఈ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుతో అపాయింట్‌మెంట్ లేటర్లు అందుకున్న 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది. టీజీపీఎస్సీ 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఫలితాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. మూల్యాంకనంలో అక్రమాలు, జెల్ పెన్నుల వాడకం, కొన్ని పరీక్షా కేంద్రాల నుంచే ఎక్కువ మంది ఎంపిక కావడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు వెల్లడించనుంది.