సిరికొండ మండలంలో పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
వార్త నేత్రం అదిలాబాద్ : మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలం సుంకిడి లో అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రం లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం పై ఆరా తీశారు. 3 సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలామృతం తో పాటు మంచి పౌష్టికాహారం అందజేసి వారి ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తు ఉండాలని ఆన్నారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారుల పై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్రం లో ఉన్న చిన్నారుల లో శ్యామ్ మామ్ పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి టిచర్ కు ఎత్తు, బరువుల పై అవగాహన ఉండాలని ఆన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు ఏడుస్తుంటే వారిని సముదాయిస్తు చాక్లెట్స్ అందించారు. అనంతరం అక్కడే ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ను సందర్శించి విద్యార్ధుల అభ్యాస సామర్థ్యాలను స్వయంగా పరీక్షించారు. విద్యార్ధులతో పాఠ్య పుస్తకం లోని పాఠాలను చదివించిన సందర్భం లో విద్యార్ధులు చక్కగా చదవడం తో వారిని అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని, టీచర్ల సమస్య లేనందున పాఠశాలకు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీస...