సిరికొండ మండలంలో పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
వార్త నేత్రం అదిలాబాద్ :
మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలం సుంకిడి లో అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రం లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం పై ఆరా తీశారు.
3 సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలామృతం తో పాటు మంచి పౌష్టికాహారం అందజేసి వారి ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తు ఉండాలని ఆన్నారు.
బరువు తక్కువగా ఉన్న చిన్నారుల పై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్రం లో ఉన్న చిన్నారుల లో శ్యామ్ మామ్ పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి టిచర్ కు ఎత్తు, బరువుల పై అవగాహన ఉండాలని ఆన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు ఏడుస్తుంటే వారిని సముదాయిస్తు చాక్లెట్స్ అందించారు.
అనంతరం అక్కడే ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ను సందర్శించి విద్యార్ధుల అభ్యాస సామర్థ్యాలను స్వయంగా పరీక్షించారు.
విద్యార్ధులతో పాఠ్య పుస్తకం లోని పాఠాలను చదివించిన సందర్భం లో విద్యార్ధులు చక్కగా చదవడం తో వారిని అభినందించారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని, టీచర్ల సమస్య లేనందున పాఠశాలకు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం విద్యార్ధుల హాజరు రిజిష్టర్ పరిశీలించి గైర్హాజర్ అయినా విద్యార్ధుల గురించి అడిగి తెలుసుకొని, విద్యార్ధులు గైర్హాజర్ కాకుండా , తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఆన్నారు.
సిరికొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ను సందర్శించి, తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులు అన్నా, చెల్లి ఇద్దరి ని బాలికను అదిలాబాద్ రెసిడెన్షియల్ పాఠశాల సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో, బాలుడిని ఇచ్చోడ బాయ్స్ స్కూల్ లో చేర్పించుటకు RCO తో కలెక్టర్ మాట్లాడారు. పదవ తరగతి విద్యార్ధులతో ముచ్చటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ప్రణాళిక బద్ధంగా కష్టపడి బాగా చదవాలని ఆన్నారు.
విద్యార్థులు లక్ష్య సాధనకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని పదవ తరగతి లో పదికి పది శాతం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, విద్యతోనే గౌరవం లభిస్తుందని ఆన్నారు.
మధ్యహ్నం భోజనం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం భోజనం లో పప్పుతో పాటు ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆన్నారు. చదువులో, సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, అభ్యాస సామర్థ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట deo ప్రణీత, తహశీల్దార్ తుకారాం, ప్రిన్సిపాల్, ఎంపిడిఓ, అంగన్వాడి టిచర్, ఆశ వర్కర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment