Posts

Hyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

  Vartha nethram Telugu | Updated: 27 Nov 2019, 05:38:31 PM దక్షిణాదిలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఎంపీ కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశమేం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి  రెండో రాజధాని  చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రచారంతో  హైదరాబాద్  రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే వార్తలొచ్చాయి.   కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంల...

సింగపూర్ కంపెనీలకు పూర్తి సహకారం.. ప్రకటించిన కేటీఆర్

Image
  Vartha nethram : 2019-11-25 09:32:48 హైదరాబాద్‌ (VARTHA NETHRAM :  తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సింగపూర్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన టీఎస్-ఐపాస్‌ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని చెప్పారు. సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ పొంగ్‌కాక్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. సింగపూర్‌, తెలంగాణల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. దేశంలోని అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా ఉందని, ఇలాంటి చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయన్నారు.

>బంగారం దిగుమతులు తగ్గాయ్‌!

Image
బంగారం దిగుమతులు తగ్గాయ్‌! న్యూదిల్లీ: కరెంటు ఖాతా లోటు(సీఏడీ)కు కారణమవుతున్న బంగారం దిగుమతులు 9శాతం తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్‌ మాసానికి వీటి విలువ 17.63 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.25లక్షల కోట్లుగా ఉన్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాది ఇదే సమయంలో పసిడి దిగుమతులు 19.4బిలియన్‌ డాలర్లు ఉండటం విశేషం. బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశ వాణిజ్య లోటు తగ్గింది. గతేడాది 116.15బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు ప్రస్తుతం 94.72బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది.  విదేశాల నుంచి బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఏడాదికి 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతూ ఉంటుంది. తాజా బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై 10శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5శాతానికి పెంచడంతో తీవ్ర ప్రభావాన్ని చూపింది

SBI బంపరాఫర్: రూ.50,000 తగ్గింపు + తక్కువ వడ్డీకే రుణం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

          వావ్.. ఈ కారుపై ఏకంగా రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్! varthanethram updete:24-11-2019 కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా ఈ ఆఫర్ అందిస్తోంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.       కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా ఈ ఆఫర్ అందిస్తోంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మూడు కార్లపై అదిరే ఆఫర్లు రెనో డస్టర్, రెనో క్విడ్, రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. రెనో డస్టర్ మోడల్‌పై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. అలాగే రూ.10,000 లాయల్టీ బోనస్ లేదా రూ.20,000 ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 4 ఏళ్లు వారంటీ రెనో క్విడ్ మోడల్‌పై కూడా రూ...

మీరేంటో చెప్పే లేటు నిద్ర

మీరేంటో చెప్పే లేటు నిద్ర...... Adilabad:మీరు రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? : అర్ధరాత్రి పన్నెండూ ఒకటి దాటితేగాని పడుకోరా? ఈ అలవాట్లే మీ ప్రవర్తన గురించి తెలియజేస్తాయట.మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో వెల్లడిస్తాయటబుద్ధిగా రాత్రి తొమ్మిదీ పదింటికే బెడ్డెక్కి ఉపక్రమించేవారి సోషల్ నెట్ వర్కే పెద్దదని ఓ అధ్యయనంలో తేలింది.ఈ నెట్ వర్క్ లో ఎక్కువగా ఉండేది కూడా ఇలాంటి . .వారేనటలో పైగా వీరి కేంద్రంగానే ఈ చాటింగులూ మీటింగులూ జరుగుతాయని పరిశోధనలో వెలుగుచూసింది మనం డైలీ ఎంత సేపు ఫోన్ వాడతాం ? ఎన్ని గంటలు మాట్లాడతాం? అనే విషయాలను బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చని ఫిలాండ్ లోని ఆల్టో వర్సిటీకి చెందిన తలాయే అలేదావుడ్ అనే పరిశోధకుడు అంటున్నారు మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన తీరుతెన్నులపై ఈయన అధ్యయనం చేస్తున్నారు.ఫోన్ , కాల్స్ఈమెయిల్స్.మెసేజ్ ల టైమింగ్స్.  సోషల్ నెట్ వర్క్ పరిధిని బట్టి వ్యక్తుల సామాజిక అలవాట్ల గురించి చెప్పొచ్చని.ఇలా కచ్చితమైన సమాచారాన్ని.సర్వేల ద్వారా పొందడం కష్టమని వివరిస్తున్నారు.ఈ పరిశోధన ఫలితాలు వ్యక్తుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఉ పయోగపడతాయని అభిప్రాయపడ్డారు....

ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్* (పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా)

టైమ్ తో పన్లేదు ఏరియాతో పన్లేదు. డేంజర్ అని తెలిస్తే.. అక్కడ అడ్డుగా నుంచునేది పోలీస్. రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీస్. బోర్డర్ నుంచి.. ఊళ్లకు వెళ్లే రోడ్ల వరకు అన్ని చోట్లా అండగా ఉండేది పోలీస్. అలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు.అన్ని ఏర్పాట్లు జరుగుతున్నయ్. అక్టోబర్ 21 కోసం అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు అధికారులు. చేతిలో లాఠీ. పాకెట్ లో గన్ను. వంటి మీద ఖాకీ డ్రస్సు.ఇంకేం అవసరం లేదు. స్కెడ్యూల్ తో పన్లేదు. టైం టేబుల్ అవసరం లేదు. ట్వంటీ ఫోర్ హవర్స్ ఆన్ డ్యూటీ. వంద నెంబర్ మోగొచ్చు. మోక్కపోవచ్చు. ఇన్ ఫర్మేషన్ వచ్చిందంటే చాలు.. ప్రమాదం ఉన్న ప్రతి చోటా ముందుగా ఉండేది పోలీసే.  ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు.ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత...పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి ...

రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాల సంఘీభావం ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి.  రాష్ట్ర బంద్‌కు కూడా రెవెన్యూ సంఘాలు సంఘీభావాన్ని ప్ర‌క‌టించాయి  ఉద్యోగులంతా భోజ‌న  విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీల‌ను ధ‌రించి రాష్ట్రంలో అన్ని త‌హ‌శీల్దార్, ఆర్డీఓ, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ముందు నిర‌స‌న తెలుపాల‌ని పిలుపునిచ్చాయి.  అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీకి మ‌ద్ద‌తుగా చేప‌ట్టే  నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలని పిలుపునిచ్చాయి.