>బంగారం దిగుమతులు తగ్గాయ్‌!

బంగారం దిగుమతులు తగ్గాయ్‌!




న్యూదిల్లీ: కరెంటు ఖాతా లోటు(సీఏడీ)కు కారణమవుతున్న బంగారం దిగుమతులు 9శాతం తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్‌ మాసానికి వీటి విలువ 17.63 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.25లక్షల కోట్లుగా ఉన్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాది ఇదే సమయంలో పసిడి దిగుమతులు 19.4బిలియన్‌ డాలర్లు ఉండటం విశేషం. బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశ వాణిజ్య లోటు తగ్గింది. గతేడాది 116.15బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు ప్రస్తుతం 94.72బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. 


విదేశాల నుంచి బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఏడాదికి 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతూ ఉంటుంది. తాజా బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై 10శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5శాతానికి పెంచడంతో తీవ్ర ప్రభావాన్ని చూపింది



Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్