మీరేంటో చెప్పే లేటు నిద్ర
మీరేంటో చెప్పే లేటు నిద్ర......
Adilabad:మీరు రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? : అర్ధరాత్రి పన్నెండూ ఒకటి దాటితేగాని పడుకోరా? ఈ అలవాట్లే మీ ప్రవర్తన గురించి తెలియజేస్తాయట.మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారో వెల్లడిస్తాయటబుద్ధిగా రాత్రి తొమ్మిదీ పదింటికే బెడ్డెక్కి ఉపక్రమించేవారి సోషల్ నెట్ వర్కే పెద్దదని ఓ అధ్యయనంలో తేలింది.ఈ నెట్ వర్క్ లో ఎక్కువగా ఉండేది కూడా ఇలాంటి . .వారేనటలో పైగా వీరి కేంద్రంగానే ఈ చాటింగులూ మీటింగులూ జరుగుతాయని పరిశోధనలో వెలుగుచూసింది
మనం డైలీ ఎంత సేపు ఫోన్ వాడతాం ? ఎన్ని గంటలు మాట్లాడతాం?
అనే విషయాలను బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చని ఫిలాండ్ లోని ఆల్టో వర్సిటీకి చెందిన తలాయే అలేదావుడ్ అనే పరిశోధకుడు అంటున్నారు
మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన తీరుతెన్నులపై ఈయన అధ్యయనం చేస్తున్నారు.ఫోన్ , కాల్స్ఈమెయిల్స్.మెసేజ్ ల టైమింగ్స్.
సోషల్ నెట్ వర్క్ పరిధిని బట్టి వ్యక్తుల సామాజిక అలవాట్ల గురించి చెప్పొచ్చని.ఇలా కచ్చితమైన సమాచారాన్ని.సర్వేల ద్వారా పొందడం కష్టమని వివరిస్తున్నారు.ఈ పరిశోధన ఫలితాలు వ్యక్తుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ఉ పయోగపడతాయని అభిప్రాయపడ్డారు.మధుమేహంకణితులు వంటి వాటిని గుర్తించేందుకు బయోమార్కర్లు ఉన్నాయి.కానీ మానసిక రుగ్మతలను కచ్చితంగా కనుగొనేందుకు పరికరాలు గానీ వైద్య పద్ధతులు గానీ లేవు.అందువల్ల ఈ మేరకు కొత్త మార్గాలను అన్వేషించాలి.నిద్రకు ఉపక్రమించే వేళల్లో క్రమరాహిత్యం ఉందంటే వాళ్లు ఏవో మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు.ఇలాంటి వారు తమ సమస్య తీవ్ర రూపం దాల్చకముందే వైద్యులను సంప్రదించేలా చూడటమే మా లక్ష్యంఅని.అలేదావుడ్ వివరించారు...
Comments
Post a Comment