SBI బంపరాఫర్: రూ.50,000 తగ్గింపు + తక్కువ వడ్డీకే రుణం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

 






 




 




 





 




వావ్.. ఈ కారుపై ఏకంగా రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్!



varthanethram updete:24-11-2019




కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా ఈ ఆఫర్ అందిస్తోంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.





 


   



కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా ఈ ఆఫర్ అందిస్తోంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మూడు కార్లపై అదిరే ఆఫర్లు


రెనో డస్టర్, రెనో క్విడ్, రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. రెనో డస్టర్ మోడల్‌పై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. అలాగే రూ.10,000 లాయల్టీ బోనస్ లేదా రూ.20,000 ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.


4 ఏళ్లు వారంటీ


రెనో క్విడ్ మోడల్‌పై కూడా రూ.50,000 వరకు ప్రయోజనం పొందొచ్చు. 4 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బాగా పాపులర్ అయిన ఎంట్రీ లెవెల్ కారుగా రెనో క్విడ్‌ను చెప్పుకోవచ్చు. మనకు కూడా రోడ్లపై చాలా క్విడ్ కార్లు కనిపిస్తూ ఉంటాయి.


రెనో క్యాప్చర్‌పై కళ్లుచెదిరే తగ్గింపు


కంపెనీకి చెందిన రెనో క్యాప్చర్ కారుపై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే రూ.5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది. పూర్తి వివరాల కోసం దగ్గరిలోని కంపెనీ షోరూమ్‌ను సంప్రదించండి.


ధర రూ.9.49 నుంచి ప్రారంభం


రెనో క్యాప్చర్ కారు ధర రూ.9.49 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.11.99 లక్షలుగా ఉంది. పెట్రోల్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక డీజిల్ వేరియంట్ ధర రూ.10.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. గరిష్ట ధర రూ.12.99 లక్షలుగా ఉంది. వేరియంట్ ప్రాతిపదికన ధర మారుతుంది.


అదిరిపోయే లుక్


కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌లా కనిపిస్తోంది. రూ.3 లక్షల డిస్కౌంట్‌తో రెనో క్యాప్చర్ కొనుగోలు చేయడానికి ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఈ కారులో అధిక గ్రౌండ్ క్లియరెన్స్, స్మార్ట్ కార్డ్ యాక్సెస్, అదిరిపోయే లుక్, వివిధ రకాల వేరియంట్లు వంటి పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.



 


 





 





 



 




 

 


 



Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్