Vartha nethram : 2019-11-25 09:32:48
హైదరాబాద్ (VARTHA NETHRAM : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సింగపూర్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన టీఎస్-ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని చెప్పారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్‌కాక్ నేతృత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. సింగపూర్, తెలంగాణల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. దేశంలోని అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉందని, ఇలాంటి చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయన్నారు.
Comments
Post a Comment