బాపూఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్.

 




హైదరాబాద్ వార్త నేత్రం ప్రతినిధి:

 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌ లో ఘనంగా జరిగాయి. లంగర్‌హౌస్‌‌లోని బాపూఘాట్‌లో ప్రముఖులు మహాత్ముడికి నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపూఘాట్‌ను సందర్శించి గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు.

బీజేపీ నేతల నివాళులు..

మహాత్మా గాంధీతో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆ మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడలో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడుస్తూ పరిసరాలను పరిశుభ్రం చేశారు.


Comments

Popular posts from this blog

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

తియ్యని విషం ..!

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...