Posts

Showing posts from October, 2024

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

Image
 మసాలా గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యాను బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...  అదిలాబాద్ వార్త నేత్రం : బేల మండలంలోని మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యానని.. ఇందుకు మసాలా గ్రామ ప్రజలు ఎంతో మద్దతు ఇచ్చారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.  మసాలా గ్రామ మాజీ సర్పంచ్  ప్రజలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆద్వర్యం లో  బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిజెపి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో శంకరన్న ని  వెంట మేముంటామంటూ ఆనాడు ధైర్యం ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం గానే గ్రామ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. గత పది ఏళ్ళు కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేనని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల అయిన తర్వాత...

క్రీడలతో మానసిక ఉల్లాసం .... ఎమ్మెల్యే పాయల్ శంకర్

Image
 వార్త నేత్రం అదిలాబాద్ : క్రీడలతో శారీరక దృఢత్వం పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.మంగళవారం జైనథ్ మండలం లోని  ప్రసిద్ధి చెందిన  లక్ష్మి నారాయణ స్వామి జాతర సందర్భంగా  జైనథ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను  ఎమ్మెల్యే పాయల్ శంకర్   ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... క్రీడల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రత్యేక కార్యచరణను రూపొందించారు అని  గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలలో క్రీడాకారులకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో నివేదికలు తయారుచేసి  వాటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ చర్చ ప్రస్తావన కొచ్చినప్పుడు వెనుకబడిన అదిలాబాద్ జిల్లాకు విధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మండలాలలో మినీ స్టేడియం లో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఏ ఒక్కటి కూడా స్టేడియం మంజూరు చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాటలే ఒకే పరిమితమైందని ఈ ప్రభుత్వం అలాకాక...

డిజిటల్ అరెస్ట్‌ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ మూడు స్టెప్స్‌ ఫాలో అవ్వండి’- ప్రధాని మోదీ

Image
ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ‘డిజిటల్ అరెస్ట్  ’  ఆన్‌లైన్ మోసాలపై దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోసగాళ్లు తాము పోలీసులం, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి, నకిలీ కేసులు నమోదు చేశామంటూ బెదిరించి తమ నుంచి లక్షల రూపాయలు లాగేసుకున్నారని అనేక మంది బాధితులు రిపోర్ట్ చేస్తున్నారు. బాధితులను ఆ మోసగాళ్లు ఎలా బెదిరిస్తారంటే... ‘మీపై కేసు బుక్ చేశాం. ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి, ఎటూ కదలొద్దు, ఎవరికీ కాల్ చేయొద్దు’ అంటూ ఆదేశాలు ఇస్తారు. భారతీయ చట్టాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రస్తావనే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదంతా మోసగాళ్ల పని అని అన్నారు. భారత్‌లోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగదని ప్రధాని తెలిపారు “పోలీసులు, సీబీఐ, నార్కోటిక్స్, ఆర్బీఐ అధికారుల్లా ఆ మోసగాళ్లు నటిస్తుంటారు” అని ప్రధాని మోదీ అన్నారు. పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటి సెటప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకుని, అవి వీడియోలో కనిపించేలా మోసగాళ్లు చూసుకుంటారు. అచ్చం నిజమైన యూనిఫామ్స్ లాంటివి ధరిస్తారు. అలాగే, నక...

దుబాయ్‌కి వీసా లేకుండానే వెళ్లొచ్చు, అదెలాగంటే..

Image
  పాస్‌పోర్ట్ కలిగిన భారతీయులకు విమానాశ్రయాల్లో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని కల్పిస్తోంది యూఏఈ. భారతీయ పౌరులకు ఇప్పటికే పలు దేశాలు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే, అసలు ‘వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి? వీసా-ఫ్రీ దేశాలతో పోలిస్తే ఇదెలా భిన్నమైనది? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ‘వీసా ఆన్ అరైవల్’ దేశాలకు వెళ్లినప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేమిటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి? మీరు వెళ్లాలనుకుంటున్న దేశం ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం కల్పిస్తుంటే, మీరు ముందస్తుగా వీసా తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్లిపోవచ్చు. ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత అక్కడి విమానాశ్రయాలు లేదా నౌకాశ్రయాల్లోనే వీసాను పొందవచ్చు. ఆకస్మిక విదేశీ ప్రయాణాలకు లేదా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మీరు ఆ దేశంలో ల్యాండ్ అయ్యాక, విమానాశ్రయాల్లో ఉండే ‘వీసా ఆన్ అరైవల్ కౌంటర్’ వద్దకు వెళ్లి, మీ డాక్యుమెంట్లను చూపించి వీసాను తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చూపించిన డాక్యుమెంట్లలో ఏమైనా లోపాలుంటే, మీ వీసా తిరస్కరణకు గురవుతుంది. వీసా జారీ ప్రక్రియను సులభత...

యంగ్ ఇండియా జాతీయ సేవా పురస్కార్ అవార్డు అందుకున్న.. అదిలాబాద్ వాసి అబ్దుల్ అజీజ్

Image
 వార్త నేత్రం 29 అక్టోబర్ 2024:   ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన   బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలను  గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన  యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు యంగ్ ఇండియా సేవా పురస్కారం 2024 ప్రకటించి వారికి   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల పంపిణి  కార్యక్రమం లో ఆహుతులు .ఆర్టిసి ఎండి సజ్జనార్ , నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్  అసోసియేషన్ అధ్యక్షుడు. మరియు చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ జే.బాలు, వెంకట పుల్లయ్య చీఫ్ అడ్వైజర్ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ , ల చేతుల మీదుగా బెస్ట్ ఫ్రెండ్స్  హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు  యంగ్ ఇండియా సేవా పురస్కారం జాతీయ అవార్డును  అందుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఎక్కడో దూరంగా ఉన్న అదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా   చేస్తున్న  సేవలను గు...

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి మరియు ఎలా నివారించాలి?

Image
  ఎక్కిళ్ళు (Hiccups) అనేవి మన శరీరంలో జరిగే సహజ ప్రక్రియలలో ఒకటి. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి మరియు సాధారణంగా మన ఆరోగ్యానికి హానికరం కాదు. ఎక్కిళ్ళు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆహారం: ఎక్కువగా, త్వరగా ఆహారాన్ని తింటున్నప్పుడు ఎక్కిళ్ళు రావచ్చు. ఈ సమయంలో, డయాఫ్రాగ్మ్ (diaphragm) మసకబారవచ్చు. దీనితో అనుకోకుండా ఊపిరి తీయడం జరుగుతుంది. చల్లని లేదా ఉప్పు ఆహారం: చల్లని పానీయాలు లేదా మసాలా ఆహారాలు తింటే కూడా ఎక్కిళ్ళు వస్తాయి. ఇది పొట్టలో ఆవిరి ఏర్పడటం వల్ల జరుగుతుంది. మానసిక ఒత్తిడి: అంతేకాకుండా మానసిక ఒత్తిడితో కూడిన సందర్భాలలో, ఉదాహరణకు ఉత్సవాలు, ఆందోళన లేదా గందరగోళం కారణంగా కూడా ఎక్కిళ్ళు వస్తాయి. ప్రాణాయామం: ప్రాణాయామం లేదా వేగంగా మాట్లాడడం వంటి కార్యకలాపాలు కూడా ఈ సమస్యను తక్కువ చేసి తేలికపాటుగా చేయవచ్చు. అనంతర ఆరోగ్య సమస్యలు: కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కిళ్ళు రావచ్చు అందువల్ల అవి ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నివారణ ఎక్కిళ్ళను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి: తక్కువ భాగాలుగా ఆహారం తినండి. మద్యం మరియు ప్రాసెస్ చ...

'హైడ్రా' భయంతో తగ్గిన ఇండ్ల కొనుగోళ్లు..

Image
  వార్త నేత్రం  హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు హైదరాబాద్ నగరంలోని బిల్డర్లు నానా తిప్పలు పడుతున్నారు. హైడ్రా కూల్చివేతలతో ఇండ్ల కొనుగోళ్లను ప్రజలు వాయిదా వేసుకుంటుండగా.. వారిచే ఇండ్లు కొనుగోలు చేయించేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ ప్రాజెక్టులకు హైడ్రా ఆమోదం ఉందంటూ కస్టమర్లకు డెవలపర్లు ఫోన్లు చేస్తున్నారు. కార్లు బహుమతి, విదేశీ టూర్ల ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నారు. హైడ్రా' భయంతో తగ్గిన ఇండ్ల కొనుగోళ్లు నగరంలో బిల్డర్ల సరికొత్త ఆలోచన అదిరే ఆఫర్లతో కస్టమర్లకు ఫోన్లు హైదరాబాద్ నగరంలో 'హైడ్రా   పేరు చెబితే బిల్డర్లు, ఇండ్ల కొనుగోళ్లదారులు హడలిపోతున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసిన కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. గత 100 రోజుల వ్యవధిలో వందల నిర్మాణాలు నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పడిందని కొందరు నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా భయంతో నగరంలో ఇళ్లు కొనాలంటేనే గృహ కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్న...

దీపావళి కానుకగా వచ్చిన స్వీట్లలో కల్తీ జరిగితే తెలుసుకోవడం ఎలా..?

Image
వార్త నేత్రం ప్రతినిది :    దీపావళి వచ్చిందంటే చాలు.. ఏ వీధిలో చూసినా భారీగా స్వీట్లను అమ్ముతుంటారు. చాలా సంస్థలు తమ ఉద్యోగులకు స్వీట్ బాక్సులను కానుకగా ఇస్తుంటాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో స్వీట్లలో కల్తీకి సంబంధించిన వార్తలు కూడా తరచూ వస్తుంటాయి. ఇటీవలి రోజుల్లో, కల్తీ పాలు, కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. డిమాండ్‌ను అందుకునేందుకు కొందరు స్వీట్లలో కృత్రిమ పదార్థాలను, రసాయనాలను కలిపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలా కల్తీ అయిన పదార్థాలు తినడం కచ్చితంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే, ఇంట్లోనే ఈ ఆహార పదార్థాలు కల్తీవో, కాదో తెలుసుకునే విధానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచిస్తోంది. ఖోయా కల్తీ అయిందని గుర్తించడమెలా? దేశ వ్యాప్తంగా ఏటా దీపావళి సమయంలో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ టన్నుల కొద్దీ కల్తీ ఖోయాను సీజ్ చేస్తూ ఉంటుంది. ఖోయా (కోవా) అనేది పాలతో చేసే పదార్థం. దీన్ని స్వీట్ల తయారీలో ఎక్కువగా వాడతారు. పాలను బాగా మరగబెట్టి ఖోయాను తయారు చేస్తారు. ఖోయా సాధారణంగా తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది...

మహిళ శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

   ఆదిలాబాద్ అక్టోబర్23 వార్త నేత్రం:బోధ్ మండలంలోని  పొచ్చర వాటర్ ఫాల్ దగ్గర ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బుధవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జలపాతాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులకు మంచి భోజనం అందించాలని కష్టపడితే కచ్చితంగా ఏదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బ్రిక్స్ సదస్సు: మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య బుధవారంనాడు ద్వైపాక్షిక చర్చలు, వెల్లడించిన విదేశాంగ శాఖ

Image
  వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణకు భారత్ -చైనా దేశాలు ఓ అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో, బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బ్రిక్స్ సమావేశాలలో బుధవారంనాడు ద్వైపాక్షి క చర్చలు జరుగుతాయని నేను ధ్రువీకరిస్తున్నాను’’ అంటూ మిస్రీ పేర్కొన్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలోనే భారత్ చైనాల మధ్య ఒక ఒప్పందం జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ సోమవారం వెల్లడించారు. “2020లో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలకు పరిష్కారం దిశగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి” అని మిస్రీ వెల్లడించారు. 2020లో  గల్వాన్ లోయలో ఘర్షణ  జరిగింది. ఆ ఘర్షణలో రెండు దేశాల వైపు ప్రాణనష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “వాస్తవాధీన రేఖ వెంట వివాదాస్పద ప్రాంతాల్లో సైన్య...