Posts

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కృషి చేస్తా – ఎంపీ గోడం నగేష్

Image
బీసీ సంఘం ప్రతినిధులతో సమావేశం ఆదిలాబాద్, నవంబర్ 18 (వార్త నేత్రం): బీసీ వర్గాల రిజర్వేషన్లు పెంపుదల అంశంపై తీవ్ర చర్చ సాగుతున్న తరుణంలో, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వచ్చిన వినతిని స్వీకరించారు.   మంగళవారం ఆదిలాబాద్‌లో బీసీ సంఘం నాయకులు ఎంపీ గోడం నగేష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని, రిజర్వేషన్ల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు నర్సా గౌడ్‌తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. నాయకులు ఎంపీ నగేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీ హక్కుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.  

పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ.. మెదక్ జిల్లాలో సంచలన ఘటన

Image
టెక్మాల్, (మెదక్) నవంబర్ 18 వార్త నేత్రం : మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక కేసుకు సంబంధించి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా, ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకి పారిపోయాడు. దీంతో ఎస్‌ఐ రాజేష్‌ని వెంబడించి, చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై రాజేష్ .. ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు.. పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చారు..

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు!

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 18 తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ విభాగాల్లో మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవ రైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 27, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టుల వివరాలు..... సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టులు మొత్తం 10 వరకు ఉన్నాయి ఇందులో.. సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్/జనరల్‌) పోస్టులు: 2 సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్‌) పోస్టులు: 3 సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ/సెరాలజీ) పోస్టులు: 3 సైంటిఫిక్ ఆఫీసర్ (కంప్యూటర్స్‌) పోస్టులు: 2   సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 32 ఇందులో.. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్/జనరల్‌) పోస్టులు: 5 సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్‌) పోస్టులు: 10 సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ/సెరాలజీ) పోస్టులు: 10 సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్స్‌) పోస్టులు: 7 ల్...

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు జాతీయ అవార్డు ..జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన ఆదిలాబాద్

Image
ఆదిలాబాద్, నవంబర్ 18 వార్త నేత్రం ప్రతినిధి : జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా ఆదిలాబాద్ జిల్లా దేశవ్యాప్తంగా గౌరవం సాధించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “జల్ చంచాయ్ – జన్ భాగీధారీ” కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సౌత్ జోన్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.  ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో పాటు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర జనశక్తి మంత్రిత్వశాఖ ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న జారీ చేసింది. మంగళవారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన  కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా జాతీయ అవార్డును స్వీకరించారు.  జిల్లా స్థాయిలో జల సంరక్షణ చర్యలను ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేయడం ఈ విజయానికి దోహదమైందని అధికారులు తెలిపారు. జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గౌరవంపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ రాజర్షి షాను అభినందించారు.  

ప్రముఖ హోటళ్ళ యజమానుల ఇళ్లలో ఐటి సోదాలు?

Image
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 18 హైదరాబాద్ నగరంలో మంగళవారం మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్ పై ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు.  పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్, షాగౌస్ హోటల్స్ పై ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు హోటల్స్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. పిస్తా హౌజ్, షా గౌస్ హోటల్ ఓనర్ల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. హోటల్స్ ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నా యి.  రాజేంద్రనగర్ లోని పిస్తా హౌజ్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో రికార్డుల్లో చూపిన ఆదాయం… నిజమైన ఆదా యం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సా క్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.  ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసా...

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు? అప్రమత్తమైన పోలీస్ అధికారులు

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:నవంబర్ 18 దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ కోర్టులో బాంబు పెట్టామంటూ మెయిల్ సందేశం వచ్చింది దానితోపాటు, పటియాల హౌస్ కోర్టు సాకేట్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు భవనాలను ఖాళీ చేయించారు.ఆక్కడ ఉన్న వారందరినీ హుటాహుటిన ఖాళీ చేయించి డాగ్ స్కాడ్ తో పాటు ఇతర ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.  అంతేకాదు నగరంలోని ద్వారకా, ప్రశాంత్ విహార్ ప్రాంతాల్లోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. బృందాలుగా విడిపోయి కోర్టులు, పాఠశాలల ప్రాంగణాలకు చేరుకున్నారు.  ముందు జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాలతోపాటూ పాఠశాలలను ఖాళీ చేయించిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అంతేకాదు, నగరంలోని అన్ని జిల్లా కోర్టుల్లోని సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా తనిఖీలు చేపట్టారు

మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఎన్ కౌంటర్?

Image
వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి  అల్లూరి జిల్లా:నవంబర్18 నక్సల్స్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మాడావి హిడ్మా,(43) హతమయ్యా డు. అతని భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం.. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం.. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాప్పులు జరిగాయి.  ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎజురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.