జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు జాతీయ అవార్డు ..జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన ఆదిలాబాద్


ఆదిలాబాద్, నవంబర్ 18 వార్త నేత్రం ప్రతినిధి : జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా ఆదిలాబాద్ జిల్లా దేశవ్యాప్తంగా గౌరవం సాధించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “జల్ చంచాయ్ – జన్ భాగీధారీ” కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సౌత్ జోన్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.  ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో పాటు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర జనశక్తి మంత్రిత్వశాఖ ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న జారీ చేసింది. మంగళవారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన  కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా జాతీయ అవార్డును స్వీకరించారు.  జిల్లా స్థాయిలో జల సంరక్షణ చర్యలను ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేయడం ఈ విజయానికి దోహదమైందని అధికారులు తెలిపారు. జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గౌరవంపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ రాజర్షి షాను అభినందించారు.  

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్