ప్రముఖ హోటళ్ళ యజమానుల ఇళ్లలో ఐటి సోదాలు?
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 18
హైదరాబాద్ నగరంలో మంగళవారం మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్ పై ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు.
పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్, షాగౌస్ హోటల్స్ పై ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు హోటల్స్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. పిస్తా హౌజ్, షా గౌస్ హోటల్ ఓనర్ల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. హోటల్స్ ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నా యి.
రాజేంద్రనగర్ లోని పిస్తా హౌజ్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ మస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో రికార్డుల్లో చూపిన ఆదాయం… నిజమైన ఆదా యం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సా క్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.
ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 4 టీమ్స్ తో మస్తాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు.మెహిఫిల్ రెస్టారెంట్ ఓనర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రముఖ బిర్యా నీ రెస్టారెంట్ చైన్లపై ఐటీ సోదాలు జరుపుతున్నారు.
భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు చేస్తున్న ఐటీ.. కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్టు అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు.
ఈ మూడు బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు, శాఖలు, అకౌంటింగ్ సెక్షన్లు, గిడ్డంగులు, నిర్వాహకులకు చెందిన ఇళ్లు వంటి చోట్ల ఒకేసారి సోదాలు జరుపు తున్నారు. మెహిఫిల్ రెస్టారెంట్ కి నగరంలో 15 బ్రాంచీలు.. అదనంగా యుఏఈలో కూడా బ్రాంచ్ లు ఉన్నట్లు గుర్తించారు. పిస్తా హౌస్ కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్లు ఉన్నట్లు గుర్తించారు. గచ్చి బౌలి, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో షా గౌజ్ హోట ళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Comments
Post a Comment