దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు? అప్రమత్తమైన పోలీస్ అధికారులు
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:నవంబర్ 18
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ కోర్టులో బాంబు పెట్టామంటూ మెయిల్ సందేశం వచ్చింది దానితోపాటు, పటియాల హౌస్ కోర్టు సాకేట్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు భవనాలను ఖాళీ చేయించారు.ఆక్కడ ఉన్న వారందరినీ హుటాహుటిన ఖాళీ చేయించి డాగ్ స్కాడ్ తో పాటు ఇతర ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.
అంతేకాదు నగరంలోని ద్వారకా, ప్రశాంత్ విహార్ ప్రాంతాల్లోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. బృందాలుగా విడిపోయి కోర్టులు, పాఠశాలల ప్రాంగణాలకు చేరుకున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాలతోపాటూ పాఠశాలలను ఖాళీ చేయించిన అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అంతేకాదు, నగరంలోని అన్ని జిల్లా కోర్టుల్లోని సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా తనిఖీలు చేపట్టారు
Comments
Post a Comment