బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కృషి చేస్తా – ఎంపీ గోడం నగేష్




బీసీ సంఘం ప్రతినిధులతో సమావేశం

ఆదిలాబాద్, నవంబర్ 18 (వార్త నేత్రం): బీసీ వర్గాల రిజర్వేషన్లు పెంపుదల అంశంపై తీవ్ర చర్చ సాగుతున్న తరుణంలో, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వచ్చిన వినతిని స్వీకరించారు.  మంగళవారం ఆదిలాబాద్‌లో బీసీ సంఘం నాయకులు ఎంపీ గోడం నగేష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని, రిజర్వేషన్ల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు నర్సా గౌడ్‌తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. నాయకులు ఎంపీ నగేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీ హక్కుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. 

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్