గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..






 తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సామ రామ్మోహన్‌ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిలను తమ అభ్యర్థులను ప్రకటించింది.


హైదరాబాద్ వార్త నేత్రం ప్రతినిధి :

 తెలంగాణలో మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఈసారి జరిగేది రెగ్యూలర్ పోలింగ్ కాదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవి చదువుకున్న వారు, మేధావులు ప్రభుత్వ పాలనకు ఇచ్చే తీర్పులాంటివని ఈ ఎన్నికల గురించి చెబుతారు. తెలంగాణ శాసనమండలికి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌‌ పట్టభద్రుల నియోజకవర్గానికి సామ రామ్మోహన్‌ రెడ్డిని, ఉమ్మడి వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిలను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఈ జాబితా విడుదలైంది. ఈ ఎంపికకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపిన అనంతరం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌ స్థానానికి ఎంపికైన సామ రాం మోహన్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా చెందిన వారు. ఆయన ప్రస్తుతం టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిసిందే. గతంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, జాతీయ అధికార ప్రతినిధిగా చేశారు. అలాగే 2017లో కాంగ్రెస్ లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షుడిగా, 2019లో పార్టీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.ఉమ్మడి వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఈయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి కుమారుడు అని తెలిసిందే. యూత్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరించేవారు సర్వోత్తమ్‌ రెడ్డి. అదే విధంగా నల్లగొండ జిల్లాలో పార్టీ కోసం కృషి చేస్తున్నారని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న ఆయన యూత్‌ కాంగ్రెస్‌లో పలు విభిన్న హోదాల్లో పార్టీకి సేవలు అందించారు. 

Comments

Popular posts from this blog

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

తియ్యని విషం ..!

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...